కరెంట్ బిల్లుల పెంపు ప్రతిపాదన తిరస్కరణ

తెలంగాణలో విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనను ఈఆర్సీ తిరస్కరించింది.

Advertisement
Update:2024-10-28 20:22 IST

రాష్ట్రంలో కరెంట్ బిల్లుల పెంపు ప్రతిపాదనను ఈఆర్సీ తిరస్కరించింది.800 యూనిట్లు దాటితే 10 నుంచి 50 శానికి ఫిక్స్‌డ్ ఛార్జీలు పెంచేందుకు అనుమతి ఇవ్వాలని డిస్కంలు ప్రతిపాదన చేశాయి. సుదీర్ఘ చర్చల అనంతరం డిస్కంల ప్రతిపాదనను ఈఆర్సీ తిరస్కరించింది. కాగా, ఇటీవల తెలంగాణలో కరెంట్ బిల్లులు సవరించాలని విద్యుత్‌ పంపిణీ సంస్థలు ప్రతిపాదించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి నెలకు 800 యూనిట్ల కంటే ఎక్కువ యూనిట్ల కరెంటు వాడితే స్థిరఛార్జీని రూ.10 నుంచి రూ.50 పెంచాలని పేర్కొన్నాయి. ఈ ప్రతిపాదనలపై ఈఆర్‌సీ విచారణ పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో ప్రక్క రాష్ట్రాల్లో కరెంట్ ఛార్జీలు ఎలా ఉన్నాయనే వివరాలతో డిస్కంలు ఈఆర్‌సీకి తాజాగా నివేదికను అందజేశాయి.

పరిశీలన అనంతరం పెంపు ప్రతిపాదనను ఈఆర్సీ తిరస్కరించింది.132కేవీఏ, 133కేవీఏ, 11కేవీలలో గతంలో మాదిరిగానే ఛార్జీలు ఉంటాయి. లిఫ్ట్ ఇరిగేషన్‌కు కమిషన్ ఆమోదించింది. టైమ్ ఆఫ్ డేలో పీక్ అవర్‌లో ఎలాంటి మార్పు లేదు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటలకు నాన్ పీక్ ఆవర్‌లో రూపాయి నుంచి రూపాయిన్నర రాయితీ పెంచాం. చేనేత కార్మికులకు హార్స్ పవర్‌ను పెంచాం. హెచ్‌పీ 10 నుంచి హెచ్‌పీ 25కి పెంచాం. గృహ వినియోగదారులకు మినిమమ్‌ చార్జీలు తొలగించాం. గ్రిడ్ సపోర్ట్ చార్జీలు కమిషన్ ఆమోదించింది. ఆర్‌ఎస్పీ ఇవి కేవలం ఐదు నెలల వరకే ఉంటాయి. రూ.11,499.52 కోట్లు ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చింది. రూ.1,800 కోట్లు ప్రపోజల్స్ ఇచ్చారు. డిస్కంలు రూ.57,728.90 పిటిషన్ వేస్తే.. ఈఆర్సీ రూ.54,183.28 కోట్లు ఆమోదించింది’ అని వివరాలను ఈఆర్సీ చైర్మన్ శ్రీరంగారావు వెల్లడించారు

Tags:    
Advertisement

Similar News