ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు : మంత్రి పొన్నం
తెలంగాణలో ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ) వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు ఇస్తున్నట్టు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
తెలంగాణలో ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ) వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు ఇస్తున్నట్టు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. కొత్తగా ఎలక్ట్రిక్ వాహనాల పాలసీపై జీవో 41ను ఆయన విడుదల చేశారు. రాష్ట్రంలో కాలుష్యాన్ని కట్టడి చేయాలని ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రాష్ట్రంలో రేపటి నుంచి కొత్త ఈవీ పాలసీ వస్తుందని చెప్పారు.
టూ వీలర్స్, ఆటో, ట్రాన్స్‌పోర్టు బస్సులకు వందశాతం పన్ను మినహాయింపు. జంట నగరాల్లో ఈవీ బస్సులు తీసుకొస్తున్నాం. దిల్లీ మాదిరిగా హైదరాబాద్‌లో కాలుష్యం రాకుండా ఉండేందుకే ఈవీ పాలసీ తీసుకొచ్చాం. ప్రజలు విద్యుత్ వాహనాల కొనుగోలుపై దృష్టి పెట్టాలి’’ అని మంత్రి పొన్నం కోరారు. ఈవీల వాహనాలు కొనుగోలుదారులతో పాటు తయారీదారులకు పోత్సాహకాలు అందిస్తామని మంత్రి పొన్నం తెలిపారు. 2026 వరుకు జీవో 41 అమల్లో ఉంటుందని మంత్రి తెలిపారు.