హైదరాబాద్ లో త్వరలో 150 ఈవీ చార్జింగ్ స్టేషన్లు..

దుర్గం చెరువులో రెడ్కో ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్‌ వాహన చార్జింగ్‌ మెషిన్‌ ను రెడ్కో చైర్మన్ సతీశ్ రెడ్డి పరిశీలించారు. కేవలం 30 నుంచి 45 నిమిషాల్లోనే కారు చార్జింగ్‌ చేసుకోవచ్చని ఆయన చెప్పారు.

Advertisement
Update:2023-01-05 11:52 IST

హైదరాబాద్ లో త్వరలో 150 ఈవీ చార్జింగ్ స్టేషన్లు..

ఎలక్ట్రిక్ వాహనాల వినియోగదారులకు హైదరాబాద్ అత్యంత అనుకూల నగరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ లో పెట్రోల్ బంకులు విస్తరించినట్టుగానే త్వరలో ఎలక్ట్రానిక్ వెహికల్ చార్జింగ్ స్టేషన్లు కూడా ఏర్పాటు కాబోతున్నాయి. త్వరలో నగరంలో 150 రెడ్కో ఎలక్ట్రిక్‌ వాహన చార్జింగ్‌ కేంద్రాలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు రెడ్కో (రెన్యూయబుల్‌ ఎనర్జీ డెవలప్ మెంట్‌ కార్పొరేషన్‌) చైర్మన్‌ వై.¬సతీశ్‌ రెడ్డి.

దుర్గం చెరువు కేంద్రం పరిశీలన..

దుర్గం చెరువులో రెడ్కో ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్‌ వాహన చార్జింగ్‌ మెషిన్‌ ను రెడ్కో చైర్మన్ సతీశ్ రెడ్డి పరిశీలించారు. త్వరలో మరిన్న చార్జింగ్ స్టేషన్లు హైదరాబాద్ లో అందుబాటులోకి వస్తాయని తెలిపారు. కేవలం 30 నుంచి 45 నిమిషాల్లోనే కారు చార్జింగ్‌ చేసుకోవచ్చని ఆయన చెప్పారు. ఇతర సంస్థలతో పోలిస్తే త¬క్కువ రేటుకే రెడ్కో చార్జింగ్ స్టేషన్లు అందుబాటులో ఉన్నాయని అన్నారు. చార్జింగ్‌ కేంద్రాల ఏర్పాటులో ముందుగా రుసు¬ము నిర్ణ¬యించిన రాష్ట్రంగా దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణ ఉందని చెప్పారు. రెడ్కో చార్జింగ్ కేంద్రాల్లో పార్కింగ్‌ సౌకర్యం, ఇతర వసతులు కల్పిస్తున్నామని అన్నారు.

కాలుష్య నివారణ దిశగా..

హైదరాబాద్ లో కాలుష్యం తగ్గించేందుకు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు రెడ్కో చైర్మన్ సతీశ్ రెడ్డి. ఇప్పటికే రెడ్కో ఆధ్వర్యంలో ఆటోల్లో ఎలక్ట్రిక్ కిట్ ఏర్పాటు చేస్తున్నారు. వెహికల్ రెట్రోఫిట్మెంట్‌ పైలట్ ప్రాజెక్ట్ లో భాగంగా 100 ఆటోల్లో ఎలక్ట్రిక్ కిట్లు బిగించారు. రెట్రో ఫిట్మెంట్ పాలసీలో తెలంగాణ, దేశానికే తలమాణికంగా ఉండేలా తయారు చేబోతున్నామ‌ని అన్నారాయన. ఇప్పుడు రెడ్కో చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుతో మరో ముందడుగు వేశామన్నారు.

Tags:    
Advertisement

Similar News