2022లో హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో ఇళ్ల విక్రయాలు

తాజా అనరాక్ సంస్థ నివేదిక ప్రకారం, దేశంలోని 7 నగరాల్లో 2022లో దాదాపు 4.02 లక్షల గృహాలు పూర్తయ్యాయి. 2021లో పూర్తయిన 2.79 లక్షల ఇళ్లతో పోలిస్తే ఇది 44% ఎక్కువ.

Advertisement
Update:2023-01-17 08:35 IST

2022 సంవత్సరంలో హైదరాబాద్ సహా దేశంలోని టాప్ ఏడు నగరాల్లో రికార్డు స్థాయిలో హౌసింగ్ అమ్మకాలు, కొత్త ప్రాజెక్టుల ప్రాంరంభాలు జరిగాయి.

తాజా అనరాక్ సంస్థ నివేదిక ప్రకారం, ఈ నగరాల్లో 2022లో దాదాపు 4.02 లక్షల గృహాలు పూర్తయ్యాయి. 2021లో పూర్తయిన 2.79 లక్షల ఇళ్లతో పోలిస్తే ఇది 44% ఎక్కువ.

2022లో పూర్తయిన ఇళ్లలో అత్యధికంగా ముంబైలో సుమారు 1.26 లక్షల యూనిట్లు ఉన్నాయి, ఇది 2021లో 70,500 యూనిట్ల కంటే దాదాపు 80% ఎక్కువ.

NCRలో, 2022లో దాదాపు 86,300 యూనిట్లు పూర్తయ్యాయి. 2021లో కూడా దాదాపు అదే స్థాయిలో ఉంది. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై మొత్తంగా 2022లో 81,580 యూనిట్లు పూర్తయ్యాయి, 2021లో అది 63,870 యూనిట్లు మాత్రమే. పుణెలో 2022లో 84,200 యూనిట్లు పూర్తయ్యాయి అయితే 2021లో 46,080 యూనిట్లు, కోల్‌కతాలో 2022 లో 23,190 యూనిట్లు పూర్తయ్యాయి . 2021లో 11,620 యూనిట్లు మాత్రమే పూర్తయ్యాయి..

"2022 సంవత్సరం భారతీయ గృహనిర్మాణ రంగానికి ఒక వెల్లువ. అమ్మకాలు 2014 కన్నా అనేక రెట్లు పెరిగాయి. ఈ అధిక డిమాండ్ వల్ల‌ డెవలపర్లు తాము గతంలో ప్రారంభించిన ప్రాజెక్ట్‌లను పూర్తి చేయడంపై దృష్టి సారించారు. అలాగే, టాప్ 7 నగరాల్లో 2022లో అత్యధికంగా 4.02 లక్షల యూనిట్లు పూర్తయ్యాయి.” అని అనరాక్ గ్రూప్ చైర్మన్ అనూజ్ పూరి తెలిపారు.

"2023లో టాప్ 7 నగరాల్లో 5.44 లక్షల యూనిట్లు పూర్తి కానున్నాయి," హైదరాబాద్‌లో దాదాపు 25,120 యూనిట్లు 2023లో పూర్తవుతాయని ఆయన చెప్పారు. ఢిల్లీ-ఎన్‌సీఆర్ 2023లో గరిష్టంగా 1,66,850 యూనిట్లు పూర్తవుతాయి.'' అని అనరాక్ గ్రూప్ చైర్మన్ అనూజ్ పూరి తెలిపారు.

Tags:    
Advertisement

Similar News