కేటీఆర్, రామ్ చరణ్.. ఏం మాట్లాడుకున్నారంటే..?
మహీంద్రా రేసింగ్ కార్ ప్రారంభోత్సవ కార్యక్రమం అద్భుతంగా జరిగిందని ట్విట్టర్లో పేర్కొన్నారు మంత్రి కేటీఆర్. ఆనంద్ మహీంద్రా, సీపీ గుర్నాని, రామ్ చరణ్ ని కలవడం సంతోషంగా ఉందన్నారు.
మంత్రి కేటీఆర్ తో తెలుగు సినీ హీరోలకు మంచి ఫ్రెండ్షిప్ ఉంది. వివిధ కార్యక్రమాల సందర్భంగా ఆయన్ను కలిసేందుకు హీరోలు ఉత్సాహం చూపిస్తుంటారు. తాజాగా మహీంద్రా కంపెనీ ఎలక్ట్రిక్ వెహికల్స్ కర్మాగారం కోసం మంత్రి కేటీఆర్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కార్యక్రమం అనంతరం మహీంద్రా సంస్థ తయారు చేసిన XUV-400 ఫార్ములా ఎడిషన్ జనరేషన్-3 రేసింగ్ కారుని ఆవిష్కరించారు. ఈ కారు ఆవిష్కరణ కోసం హీరో రామ్ చరణ్ కూడా వచ్చారు. కేటీఆర్, రామ్ చరణ్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
మహీంద్రా రేసింగ్ కార్ ప్రారంభోత్సవ కార్యక్రమం అద్భుతంగా జరిగిందని ట్విట్టర్లో పేర్కొన్నారు మంత్రి కేటీఆర్. ఆనంద్ మహీంద్రా, సీపీ గుర్నాని, రామ్ చరణ్ ని కలవడం సంతోషంగా ఉందన్నారు. ఇటీవలే గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ వచ్చిన సందర్భంగా రామ్ చరణ్ కి శుభాకాంక్షలు తెలిపినట్టు చెప్పారు కేటీఆర్. ఆస్కార్ కి నామినేట్ అయిన ఆర్ఆర్ఆర్ కి ఆ అవార్డ్ కచ్చితంగా రావాలని ఆకాంక్షించారు.
వెయ్యికోట్ల పెట్టుబడి..
ఇప్పటికే జహీరాబాద్ లో మహీంద్రా కంపెనీకి ఓ ప్లాంట్ ఉంది. దానికి అనుబంధంగా ఎలక్ట్రిక్ వాహనాల కర్మాగారాన్ని వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడితో ప్రారంభించబోతున్నారు. లాస్ట్ మైల్ మొబిలిటీ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. దీనికోసం తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో మహీంద్రా కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్లాంట్ లో వెయ్యి మందికి కొత్తగా ఉద్యోగ అవకాశాలు లభించబోతున్నాయి. ఇక్కడ ఎలక్ట్రిక్ త్రీవీలర్లు, ఫోర్ వీలర్లు తయారు చేస్తారు.