న్యూ ఇయర్‌ వేడుకలపై రాజాసింగ్ షాకింగ్ కామెంట్స్

న్యూ ఇయర్‌ వేడుకలపై బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ హాట్‌ కామెంట్స్‌ చేశారు

Advertisement
Update:2024-12-31 14:57 IST

నూతన సంవత్సర వేడుకలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పేరుతో గోవాకు, క్లబ్, పబ్బ్‌లకు వెళ్ళడమేనా మన సంస్కృతి అంటూ గోషామహల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జనవరి పస్ట్ నూతన సంవత్సరమని బ్రిటీష్ పాలకులు మనపైన రుద్ది వెళ్లారని ఆయన మండిపడ్డారు. ఇవాళ రాజాసింగ్ మీడియాకు ఓ వీడియోను విడుదల చేశారు. మనకు కొత్త సంవత్సరం జనవరి ఒకటోతారీఖు కాదని ఉగాది మన హిందూవులకు నూతన సంవత్సరం అని రాజాసింగ్ తెలిపారు.

ఈ కొత్త సంవత్సరం పేరుతో మన భవిష్యత్తు తరాలకు విదేశీ కల్చర్ ను అలవాటు చేస్తున్నారని ఆగ్రహించారు. డిసెంబర్ 31..జనవరి 1 కొత్త సంవత్సరం ఈవెంట్స్ పేరుతో హిందువులు ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారని రాజాసింగ్ పేర్కొన్నారు. ఉగాది కొత్త సంవత్సరం అని మన భవిష్యత్తు తరాలకు అలవాటు చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Tags:    
Advertisement

Similar News