తెలంగాణలో మూడు రోజులు వర్షాలు..ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్

తెలంగాణలో మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

Advertisement
Update:2024-10-05 17:24 IST

తెలంగాణలో రాబోయే మూడు రోజుల పాటు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్రవారం పశ్చిమ - మధ్య దక్షిణ బంగాళాఖాతం వద్ద సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ. ఎత్తులో ఏర్పడిన ఆవర్తనం.. ఇవాళ పశ్చిమ - మధ్య బంగాళాఖాతంలో ఆంధ్ర ప్రదేశ్ తీరానికి చేరువగా సగటు సముద్ర మట్టానికి 1.5 కి. మీ. నుంచి 4.5 కి.మీ మధ్యలో కొనసాగుతున్నట్లు వెల్లడించింది. ఈ ప్రభావంతో తెలంగాణలోకి పశ్చిమ, వాయువ్య దిశ నుంచి గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.

రేపు యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌ నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ హెచ్చరికలు సైతం జారీ చేసింది. మరోవైపు ఇవాళ మధ్యాహ్నం నుంచి తిరుమలలో భారీ వర్షం కురిసింది. దాదపు గంటకు పైగా కురిసిన వర్షంతో రోడ్డులు జలమయం అయ్యాయి. మాడ వీధుల్లో వరద నీరు చేరి చేరువును తలపించింది. తిరుమల దర్శనానికి వచ్చిన భక్తులు వానతో తడిసిముద్దయ్యారు.

Tags:    
Advertisement

Similar News