తెలంగాణలో రాబోయే మూడు రోజులు వర్షాలు : ఐఎండీ
తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
Advertisement
తెలంగాణలో రాబోయే మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొన్నాది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ వెల్లడించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ ఉదయం వేళల్లో దట్టమైన పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. వచ్చే వారం రోజుల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు ఉండబోదని వెల్లడించింది. రాష్ట్రంలోకి కింది స్థాయి గాలులు ప్రధానంగా తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి వీస్తున్నట్లు పేర్కొంది.
Advertisement