హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షం
చలితో ఇబ్బంది పడుతున్న నగరవాసులు
Advertisement
హైదరాబాద్‌లోని అనేక ప్రాంతాల్లో వర్షం కురిసింది. గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు ప్రాంతాల్లో వర్షం పడింది. వర్షానికి తోడు తీవ్రమైన చలిగాలులు వీస్తుండటంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సికింద్రాబాద్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్ పేట, కూకట్‌పల్లి, బోరబండి, తార్నాక, కోఠి, హిమాయత్ నగర్, సహా పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో రోడ్లపై ఉన్న వాహనదారులు, ప్రజలు తడిసిపోయారు.
Advertisement