అప్పుడే రాహుల్ తెలంగాణకు రావాలి : బండి సంజయ్

ఆరు గ్యారంటీలపై సమాధానం చెప్పాకే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణకు రావాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు.

Advertisement
Update:2024-11-05 14:38 IST

లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి వచ్చే ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీలను ఎందుకు అమలు చేయలేదో ప్రజలకు సమాధానం చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. గత సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్, అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీకి, పలు యూనివర్సిటీకి వెళ్ళీ విద్యార్ధులను రెచ్చగొట్టారని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ మహిళలను, రైతులకు, అన్ని వర్గాల ప్రజలకు మోసం చేసిందని ఆరోపించారు. 420హామీలిచ్చి వెళ్ళారని, మళ్ళీ ఈ రోజు తెలంగాణకు వస్తున్నారని విమర్శించారు.

ఏ పార్టీ నాయకులైనా దేశంలో ఎక్కడైనా తిరుగవచ్చన్నారు. అయితే ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో రేవంత్ ప్రభుత్వం విఫలమవ్వడంపై రాహుల్ గాంధీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు. తను ఇచ్చిన మాటపై తనకు నమ్మకముంటే రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలకు ఎన్నికల హామీల వైఫల్యంపై జవాబు చెప్పి తెలంగాణలో అడుగుపెట్టాలన్నారు. గతంలో రాహుల్ గాంధీ జోడో పాదయాత్ర చేశారని, ఇప్పుడు దమ్ముంటే ఆరు గ్యారంటీలపై ఆయన తెలంగాణ యాత్ర చేయాలని బండి సంజయ్ సవాల్ విసిరారు.

Tags:    
Advertisement

Similar News