ర్యాగింగ్‌ కలకలం.. 81 మంది సస్పెన్షన్‌

జూనియర్లను వేధించిన ఆరోపణలపై విచారణ జరిపిన అనంతరం వేధింపులు నిజమేనని నిర్ధారించి సీనియర్లను సస్పెండ్‌ చేసినట్టు వెల్లడించారు.

Advertisement
Update:2023-12-24 09:16 IST

ర్యాగింగ్‌కి పాల్పడుతున్నారన్న కారణంతో వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీలో 81 మందిని సస్పెండ్‌ చేశారు. వారంతా విద్యార్థినులే కావడం గమనార్హం. జూనియర్లు వీరి వేధింపులు తాళలేక ఫిర్యాదు చేయడంతో వర్సిటీ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 81 మందిని వారం రోజులపాటు సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలిచ్చారు.

అయితే యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్‌ రమేష్‌ మాట్లాడుతూ.. యూనివర్సిటీలో ర్యాగింగ్‌ జరగలేదని తెలిపారు. పరిచయ వేదిక పేరుతో జూనియర్లను సీనియర్లు పిలిచి మాట్లాడారని, హాస్టల్లోనూ మరోసారి ఇంట్రడక్షన్‌ తీసుకున్నారని చెప్పారు. ఈ క్రమంలో జూనియర్లను వేధించిన ఆరోపణలపై విచారణ జరిపిన అనంతరం వేధింపులు నిజమేనని నిర్ధారించి సీనియర్లను సస్పెండ్‌ చేసినట్టు వెల్లడించారు. అర్ధరాత్రి హాస్టల్‌ రూముకు పిలిచి వారిని వేధించినట్టు తేలిందన్నారు.

సస్పెండ్‌ అయినవారిలో 28 మంది పీజీ, 28 మంది కామర్స్, 25 మంది ఎకనామిక్స్‌ విద్యార్థినులతో పాటు జువాలజీ సెకండియర్‌ విద్యార్థినులు కూడా ఉన్నారు. వీరిని వారం రోజులపాటు సస్పెండ్‌ చేస్తున్నట్టు వర్సిటీ అధికారులు ధ్రువీకరించారు.

Tags:    
Advertisement

Similar News