పటాన్ చెరు కాంగ్రెస్‌లో రగడ

పటాన్ చెరు నియోజకవర్గంలో కాటా శ్రీనివాస్ గౌడ్, స్ధానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మధ్య పంచాయితీ గాంధీ భవన్‌కి చేరింది

Advertisement
Update:2024-11-21 16:19 IST

పఠాన్ చెరు కాంగ్రెస్‌లో రగడ మొదలైంది. కొంతకాలంగా నియోజకవర్గ ఇంచార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్, స్ధానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. ఈ పంచాయితీ గాంధీ భవన్‌కి చేరింది. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో కేసులను ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసిన మమ్మల్ని పక్కన పెడుతున్నారని కాటా శ్రీనివాస్ గౌడ్ అధినాయకుల ముందు ఆవేదన వ్యక్తం చేశారు.

కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన వారికి పదవులు ఇవ్వడం ఏంటి అని ప్రశ్నించారు. మహిపాల్ రెడ్డి తన సన్నిహితులకే పదవులు ఇస్తున్నాడని వాపోయారు. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి రాత్రికి రాత్రి తన మనుషులకు పోస్టింగ్ లు ఇప్పించుకుంటున్నారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన వారికే తిరిగి పోస్టింగ్ లు ఇప్పించాడు గూడెం. అసలు కాంగ్రెస్ పార్టీ ని డ్యామేజ్ చేయడానికే గూడెం బీఆర్‌ఎస్ నుండి వచ్చాడు అని కాటా శ్రీను అన్నారు

Tags:    
Advertisement

Similar News