పింఛన్ రూ.6000 పెంచాలని దివ్యాంగుల నిరసనలు
రూ. 6000 పెన్షన్ ఇవ్వాలని, ఉచిత బస్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ దివ్యాంగులు జగిత్యాల కలెక్టర్ కార్యాలయం ముందు దివ్యాంగుల నిరసన చేపట్టారు.
దివ్యాంగులకు రూ. 6000 పెన్షన్ ఇవ్వాలని, ఉచిత బస్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల కలెక్టర్ కార్యాలయం ముందు దివ్యాంగుల నిరసన చేపట్టారు. కాంగెస్ పార్టీ ఎన్నికల హామీలో దివ్యాంగులకు రూ. 6000 పెన్షన్ పెంచుతామని ఇచ్చిన హామీ నెరవేర్చలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలు రోడ్ల మీదకు వస్తున్నారు. అమలు సాధ్యం కానీ హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టింది. ఓడ ఎక్కే వరకు ఓడ మల్లయ్య ఓడ దిగాక బోడి మల్లయ్య అన్న చందంగా ఇచ్చిన హామీలను గాలికొదిలేసి రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో బిజీగా ఉంది.
కానీ, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని దివ్యాంగులు సైతం ధర్నాకు దిగారు. గత శాసన సభ ఎన్నికల్లో ఇచ్చిన హా మీ మేరకు దివ్యాంగుల పింఛన్‌ను రూ.4,016 నుంచి రూ.6,016కు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే పెంచాలని డిమాండ్ చేస్తూ దివ్యాంగులు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయా జిల్లాల కలెక్టరేట్ల వద్ద ధర్నాలు నిర్వహించారు. ఇచ్చిన హామీ మేరకు పింఛన్ మొత్తాన్ని పెంచాలని డిమాండ్ చేశారు. అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు