బీఆర్‌ఎస్‌ హయాంలో కట్టింది కూలిపోయే ప్రాజెక్టులు

బీఆర్‌ఎస్‌ హయాంలో నల్గొండ జిల్లాలో కొత్తగా ఒక ఎకరా సాగులోకి వచ్చినా.. నేను రాజీనామా చేస్తానని మంత్రి కోమటిరెడ్డి సవాల్‌

Advertisement
Update:2024-12-21 13:14 IST

బీఆర్‌ఎస్‌ హయాంలో గరిష్ఠంగా 14 గంటల కరెంటు మాత్రమే వచ్చేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఆ 14 గంటల్లోనూ ఐదారుసార్లు కోతలు ఉండేవని విద్యుత్‌ సిబ్బంది చెప్పేవారు అన్నారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ.. కేటీఆర్‌ తమ హయాంలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు ఇచ్చిన దానిపై ఆయన స్పందించారు. బీఆర్‌ఎస్‌ హయాంలో నల్గొండ జిల్లాలో కొత్తగా ఒక ఎకరా సాగులోకి వచ్చినా.. నేను రాజీనామా చేస్తానని సవాల్‌ విసిరారు. వాళ్ల పాలనలో నీళ్లు, విద్యుత్‌.. ఏమీ ఇవ్వలేదు. వాళ్లు కట్టింది కాళేశ్వరం ప్రాజెక్టు కాదు.. కూలేశ్వరం ప్రాజెక్టు అని ఎద్దేవా చేశారు. మిషన్‌ భగీరథలో రూ. 50 వేల కోట్లు తినేశారని మంత్రి కోమటిరెడ్డి ఆరోపించారు.

దీనిపై స్పందించిన మాజీ మంత్రి హరీశ్‌ రావు మిషన్‌ భగీరథకు అయిన ఖర్చు రూ. 28 వేల కోట్లు అయితే రూ. 50 వేల కోట్లు తిన్నారని కోమటిరెడ్డి ఎలా మాట్లాడుతారు? అని ప్రశ్నించారు. మిషన్‌ భగీరథపై కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొ లిగించాలని డిమాండ్‌ చేశారు. కాళేశ్వరం ద్వారా నల్గొండ జిల్లాలో 2 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చామన్నారు. నల్గొండ మెడికల్ కాలేజీలు పెట్టింది కేసీఆర్‌ అని హరీశ్‌ గుర్తుచేశారు.

Tags:    
Advertisement

Similar News