బీజేపీ వదిలిన బాణమేనా..? షర్మిలకు మోడీ ఫోన్..!

మొత్తం మీద మొన్నటి వరకు ఓట్లు చీల్చడం కోసం షర్మిలను సపోర్టు షూటర్ గా తెరపైకి తెచ్చిన బీజేపీ ఇప్పుడు ప్లాన్ మార్చి నేరుగా ఆమెతో జతకట్టేందుకు సిద్ధమవుతోందా అన్న ఊహాగానాలు వస్తున్నాయి.

Advertisement
Update:2022-12-06 12:41 IST

టీఆర్‌ఎస్ నేతల అనుమానాలే నిజమవుతున్నట్టుగా ఉంది. ఒక మతం ఓట్లు నేరుగా బీజేపీకి పడే ఛాన్స్ లేదు కాబట్టి.. ఆ ఓట్లు అత్యధికంగా టీఆర్‌ఎస్‌ వైపు వెళ్లే అవకాశం ఉంది కాబట్టి.. ఆ ఓట్లను మధ్యలో చీల్చడానికే షర్మిలను బీజేపీ రంగంలోకి దింపిందన్న ప్రచారం ఉంది. ఇటీవల షర్మిల నడిరోడ్డుపై న్యూసెన్స్ చేస్తుండటంతో, ఎంత నచ్చజెప్పినా వినకపోవడంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఆ సమయంలో బీజేపీ నేత‌ బండి సంజయ్‌ నుంచి గవర్నర్‌ వరకు అందరూ స్పందించారు. షర్మిలను వెనుకేసుకొచ్చారు. దాంతో ఆమె వెనుక బీజేపీ ఉందన్న ప్రచారం మరింత ఊపందుకుంది.

తాజాగా ప్రధాని నరేంద్ర మోడీనే స్వయంగా షర్మిలకు ఫోన్ చేసినట్టు ప్రచారం నడుస్తోంది. పరోక్షంగా షర్మిల కూడా ధృవీకరించారు. షర్మిలకు ఫోన్ చేసిన ప్రధాని మోడీ.. అరెస్ట్‌ సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరు తనకు బాధ కలిగించిందని చెప్పారని జగన్‌కు వ్యతిరేకంగా, షర్మిలకు సానుకూలంగా ఉండే టీడీపీ అనుకూల ఛానల్ ఒకటి తొలుత ప్రసారం చేసింది. ఆ తర్వాత అదే అంశాన్ని మీడియా ప్రస్తావించగా.. షర్మిల మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. ఢిల్లీ వచ్చి తనను కలవాల్సిందిగా మోడీ సూచించారని కూడా ఆమె వార్తలకు బాగా ప్రాచూర్యం కల్పించే మీడియా ప్రచారం చేస్తోంది.

ప్రధాని మోడీ మీ పట్ల సంఘీభావం తెలిపారట కదా అని మీడియా ప్రశ్నించగా... నరేంద్రమోడీకి కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు ఆమె వ్యాఖ్యానించారు. చాలా మంది తనకు ఫోన్ చేసి సంఘీభావం తెలిపారన్నారు. సంఘీభావం తెలపకుండానే బాధపడిన వారూ చాలా ఉంది ఉన్నారని వ్యాఖ్యానించారు.

మొత్తం మీద మొన్నటి వరకు ఓట్లు చీల్చడం కోసం షర్మిలను సపోర్టు షూటర్ గా తెరపైకి తెచ్చిన బీజేపీ ఇప్పుడు ప్లాన్ మార్చి నేరుగా ఆమెతో జతకట్టేందుకు సిద్ధమవుతోందా అన్న ఊహాగానాలు వస్తున్నాయి.

Tags:    
Advertisement

Similar News