రాష్ట్రపతి నిలయంలో శిల్ప ఉద్యానవనం ప్రారంభం

బొల్లారం రాష్ట్రపతి నిలయంలోని రాక్ గార్డెన్‌లోని శివుని దక్షిణామూర్తి శిల్పం, శివుని వాహనమైన నంది శిల్పాలను ద్రౌపది ముర్ము సందర్శించారు.

Advertisement
Update:2023-12-21 18:13 IST

సికింద్రాబాద్-బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఏర్పాటు చేసిన శిల్ప ఉద్యానవనాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం ప్రారంభించారు. బొల్లారం రాష్ట్రపతి నిలయంలోని రాక్ గార్డెన్‌లోని శివుని దక్షిణామూర్తి శిల్పం, శివుని వాహనమైన నంది శిల్పాలను ద్రౌపది ముర్ము సందర్శించారు.

స్థాపత్య వేద రీసెర్చ్ ఫౌండేషన్, అధ్యక్షులు డి.ఎస్.వీ ప్రసాద్, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్, సీఈఓ, డాక్ట‌ర్‌ ఈమని శివనాగిరెడ్డి ఏర్పాటు చేసిన శివ-దక్షిణామూర్తి రూపాల ఎగ్జిబిషన్‌ను తిలకించారు. దక్షిణామూర్తి, నంది శిల్పాలను చెక్కిన శిల్పి పెంచల ప్రసాద్‌ను, పర్యవేక్షణకులు ఈమని శివనాగిరెడ్డిని రాష్ట్రపతి అభినందించారు.

అనంతరం కంభంపాటి శంకర ప్రసాద్ గీసిన దక్షిణామూర్తి వర్ణ చిత్రాన్నిరాష్ట్ర‌ప‌తికి డి.ఎస్.వి ప్రసాద్ బ‌హూకరించారు.



 


Tags:    
Advertisement

Similar News