గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు రాష్ట్రపతి ప్రశంస

నిస్వార్థంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారంటూ సంతోష్ కుమార్ ని రాష్ట్రపతి అభినందించారు. ప్రజలకు, పర్యావరణానికి ఉపయోగకరమైన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ ను మరింత ఉధృతంగా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.

Advertisement
Update:2023-07-05 06:22 IST

మొక్కలు నాటడం అంటే తనకు చాలా ఇష్టమని, వివిధ కార్యక్రమాలతో బిజీగా ఉన్నా, మొక్కల పెంపకానికి తాను సమయం కేటాయిస్తానని అన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఈసారి హైదరబాద్ వచ్చినప్పుడు కచ్చితంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటుతానని అన్నారు. ఇది ఓ అద్భుత కార్యక్రమం అని ప్రశంసించారు. ఎక్కడా స్వార్థం లేకుండా ఈ కార్యక్రమాన్ని అంకితభావంతో ముందుకు తీసుకుపోతున్నారంటూ ఎంపీ సంతోష్‌ కుమార్‌ ని రాష్ట్రపతి అభినందించారు.

అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ సృష్టికర్త, ఎంపీ సంతోష్‌ కుమార్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. మొక్కల ప్రాధాన్యాన్ని తెలిపే వృక్షవేదం పుస్తకాన్ని రాష్ట్రపతికి బహూకరించారు. ఓ మొక్కను కూడా అందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని మరింత ప్రోత్సహించాలని ఆయన రాష్ట్రపతిని కోరారు.


ఈ సందర్భంగా.. గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ గురించి తనకు తెలుసని అన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. నిస్వార్థంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారంటూ సంతోష్ కుమార్ ని ఆమె అభినందించారు. ప్రజలకు, పర్యావరణానికి ఉపయోగకరమైన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ ను మరింత ఉధృతంగా ముందుకు తీసుకెళ్లాలని ఆమె సూచించారు. రాష్ట్రపతి చొరవ, గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ పట్ల ఆమె చూపించిన అభిమానం మరువలేనని ఈ సందర్భంగా సంతోష్ కుమార్ ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపారు. 

Tags:    
Advertisement

Similar News