Vani Jayaram: ప్రముఖ గాయని వాణీ జయరాం కన్నుమూత!
Vani Jayaram Death: వాణీ జయరాం తమిళనాడు లోని వెల్లూరులో జన్మించింది. ఆమె తల్లి వీణా విద్వాంసులు రంగ రామనుజ అయ్యంగార్ శిష్యురాలు. వాణి జయరాం పసి ప్రాయం లోనే బాల మేధావిగా విశేష ప్రతిభ కనబర్చింది. ఎనిమిదవ ఏటనే ఆవిడ ఆల్ ఇండియా రేడియో కార్యక్రమంలో పాల్గొంది.
ప్రముఖ గాయని వాణీ జయరాం కన్నుమూతప్రముఖ నేపథ్యగాయని వాణీ జయరాం కనుమూశారు. చెన్నైలోని ఆమె నివాసంలో ఆమె కొద్ది సేపటి క్రితం మరణించారు. ఆమె తెలుగు, తమిళ, కన్నడ, మళయాలం, హిందీ, ఒడియా, తులు, మరాఠీ, గుజరాతీ, హర్యాన్వీ, అస్సామి, బెంగాలి తదితర 19 భాషల్లో పాటలు పాడిన78 ఏళ్ళ వాణీ జయరాంను ఈ మధ్యే ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది.
వాణీ జయరాం అసలు పేరు కలైవాని. 1971లో గాయనిగా సినీరంగంలోకిప్రవేశించిన ఆమె 20 వేలకు పైగా పాటలు పాడారు.
వాణీ జయరాం తమిళనాడు లోని వెల్లూరులో జన్మించింది. ఆమె తల్లి వీణా విద్వాంసులు రంగ రామనుజ అయ్యంగార్ శిష్యురాలు. వాణి జయరాం పసి ప్రాయం లోనే బాల మేధావిగా విశేష ప్రతిభ కనబర్చింది. ఎనిమిదవ ఏటనే ఆవిడ ఆల్ ఇండియా రేడియో కార్యక్రమంలో పాల్గొంది.
ఆమె కర్నాటక సంగీతం కడలూరు శ్రీనివాస అయ్యంగార్, టి.ఆర్, బాలసుబ్రమణియన్, ఆర్.యెస్ మణి ల వద్ద అభ్యసించగా, హిందుస్తాని సంగీతం ప్రఖ్యాత ఉస్తాద్ అబ్దుల్ రహ్మాన్ ఖాన్ వద్ద నేర్చుకున్నారు.
వివాహానంతరం భర్తతో ముంబయిలో స్థిరపడ్డ వాణి జయరాం అనుకోని విధంగా హిందీ సంగీత దర్శకుడు వసంత్ దేశాయ్ ని కలవడం అలా ఆవిడ హృషీకేష్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ప్రముఖ హిందీ చలన చిత్రం "గుడ్డి" లోని "బోలె రే పపీ హరా" ద్వారా సినీ నేపధ్య గాయకురాలిగా ఆరంగేట్రం చేశారు.
వాణి జయరాం మూడు సార్లు నేషనల్ ఫిల్మ్ అవార్డులు గెల్చుకుంది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ అవార్డులను కూడా ఆమె గెల్చుకున్నారు. ఆమెఫిల్మ్ ఫేర్ లైఫ్ టైమ్ అచ్చీవ్ మెంట్ అవార్డు కూడా సాధించారు.