ఖర్చంతా మాదే.. వచ్చి ఓటేస్తే చాలు

హైదరాబాద్‌లో ఉన్న ఓటర్లకు తమ తమ నియోజకవర్గాల లీడర్ల నుంచి ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి. వచ్చి ఓటేసి వెళ్లండి, ఖర్చంతా మాదే అని బుజ్జగిస్తున్నారు.

Advertisement
Update:2023-11-26 10:08 IST

తెలంగాణ ఎన్నికలకు కౌంట్‌ డౌన్ మొదలైంది. పోలింగ్‌కు మరో 4 రోజులే మిగిలుంది. పొలిటికల్‌ పార్టీలన్నీ ఓటర్లపై దృష్టిపెట్టాయి. నియోజకవర్గంలోని ఒక్క ఓటు కూడా మిస్‌ కావొద్దని తెగ ఆరాటపడుతున్నాయి. ఉద్యోగం, ఉపాధి కోసం పట్టణాలకు వెళ్లిన వాళ్లను తిరిగి రప్పించేందుకు నానా తంటాలు పడుతున్నారు లీడర్లు.

హైదరాబాద్‌లో ఉన్న ఓటర్లకు తమ తమ నియోజకవర్గాల లీడర్ల నుంచి ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి. వచ్చి ఓటేసి వెళ్లండి, ఖర్చంతా మాదే అని బుజ్జగిస్తున్నారు. ఇన్నాళ్లు నియోజకవర్గానికి వెళ్లాక ఓటుకు ఇంత, దారి ఖర్చులకు ఇంతా అని డబ్బులు ఇచ్చేవారు. కానీ, ఇపుడు అంతా ఆన్‌లైన్‌ అయిపోయింది. దీన్ని క్యాష్ చేసుకుంటున్నాయి పొలిటికల్ పార్టీలు. ఓటర్లు నో చెప్పేందుకు అవకాశం లేకుండా ముందే డబ్బులు ఫోన్‌ పే చేసేస్తున్నారు.

ఇంకొందరైతే ఓటర్ల కోసం ఏకంగా స్పెషల్ వెహికల్స్ పెడుతున్నారు. పక్క రాష్ట్రాల్లో ఉన్నవాళ్ల కోసం మినీ బస్సులు పెట్టి మరీ నియోజకవర్గాలకు రప్పిస్తున్నారు. ఇలా ఓటర్లను రప్పించేందుకు పొలిటికల్ పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కాస్త ఆలస్యం జరిగిన ఓటు పక్క పార్టీకి వెళ్ల‌కుండా జాగ్ర‌త్త ప‌డుతున్నారు. డబ్బుల విషయంలో ఏమాత్రం వెనుకడుగు వేయట్లేదు.

Tags:    
Advertisement

Similar News