రేవంత్ మాస్టర్ ప్లాన్.. పోచారం ఇంట్లో పొలిటికల్ డిన్నర్

పోచారం ఇంట్లో జరిగిన ఈ రాజకీయ విందుతో ఆ 9 మంది తమతోనే ఉన్నారనే సంకేతాన్ని పంపించారు సీఎం రేవంత్ రెడ్డి.

Advertisement
Update:2024-08-01 09:42 IST

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన ఎమ్మెల్యేలలో ఆల్రడీ ఒకరు చేజారారు. మరికొందరు హ్యాండ్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారనే సమాచారం ఉంది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి నష్టనివారణ చర్యలు చేపట్టారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలందర్నీ ఓచోట చేర్చారు. వారితో మాట్లాడారు. మాజీ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఈ పొలిటికల్ మీటింగ్ జరిగింది. పోచారం ఇంటిలోనే అందరూ భోజనం చేసి తాజా రాజకీయ పరిస్థితుల్ని చర్చించారు.

ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున 39మంది ఎమ్మెల్యేలు గెలవగా, లాస్యనందిత మరణం, ఆ తర్వాత ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుతో ఆ సంఖ్య 38కి చేరింది. ఇందులో 10మంది కాంగ్రెస్ వైపు వెళ్లగా బీఆర్ఎస్ బలం 28కి తగ్గింది. అందులో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరుకోగా ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బలం 29కి పెరిగింది. మిగతా 9మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రేవంత్ రెడ్డి ఇప్పుడు సమావేశమయ్యారు.

పోచారం సహా అరికెపూడి గాంధీ, ప్రకాశ్‌గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, కడియం శ్రీహరి, కాలె యాదయ్య, డాక్టర్ సంజయ్, తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్ తో సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి తదితరులు భేటీ అయ్యారు. మిగిలిన నాయకులెవరూ చేజారకుండా సీఎం రేవంత్ రెడ్డి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మిగిలిన 9మందిలో ఎవరైనా బీఆర్ఎస్ తో టచ్ లో ఉన్నారా..? అనే విషయాలపై కూడా సీఎం ఆరా తీస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతానికి ఈ రాజకీయ విందు భోజనంతో ఆ 9 మంది తమతోనే ఉన్నారనే సంకేతాన్ని పంపించారు సీఎం రేవంత్ రెడ్డి. 

Tags:    
Advertisement

Similar News