తెలంగాణలో పొలిటికల్ పార్టీలకు షాక్..!
స్టేట్ లెవల్ సర్టిఫికేషన్ కమిటీ ఆమోదించిన రాజకీయ ప్రకటనలను దుర్వినియోగం చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్. లీడర్లు ఈసీ రూల్స్ బ్రేక్ చేస్తూ తమకు కావాల్సినట్లు ప్రకటనలు తయారుచేసి ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు
Advertisement
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని రాజకీయ పార్టీలకు షాక్ ఇచ్చింది ఎలక్షన్ కమిషన్. రాష్ట్రంలో అన్ని రకాల రాజకీయ ప్రకటనలకు అనుమతులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అన్ని టీవీ, సోషల్‌మీడియా ఛానల్స్‌కు లేఖలు రాశారు.
స్టేట్ లెవల్ సర్టిఫికేషన్ కమిటీ ఆమోదించిన రాజకీయ ప్రకటనలను దుర్వినియోగం చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్. లీడర్లు ఈసీ రూల్స్ బ్రేక్ చేస్తూ తమకు కావాల్సినట్లు ప్రకటనలు తయారుచేసి ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు
మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను ఉల్లంఘిస్తున్న కారణంగా పొలిటికల్ యాడ్స్ ను రద్దు చేస్తున్నట్లు CEO ఆఫీసు లేఖలో పేర్కొంది. ఆ ప్రకటనలకు సంబంధించిన కొన్ని వీడియోలు, క్లిప్ లను కూడా సీఈఓ కార్యాలయం జతపరచింది.
Advertisement