న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌పై పోలీసులు ఆంక్షలు

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌పై రాచకొండ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

Advertisement
Update:2024-12-30 16:52 IST

న్యూ ఇయర్ స్వాగతం పలికేందుకు దేశం మొత్తం సిద్ధమవుతోన్న సమయంలో హైదరాబాద్ పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నగర ప్రజలకు రాచకొండ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శాంతి భద్రతలకు భద్రతలకు ఆటంకం లేకుండా సంబరాలు జరిగేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో పలు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని బైక్ రేసులు, అతివేగంతో దూసుకెళ్లే ప్రమాదమున్నందున నగరంలోని అన్ని ఫ్లై ఓవర్లను మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 31 రాత్రి 11 గంటల నుంచి 1 జనవరి 2025 తెల్లవారుజామున 5 గంటల వరకు ఓఆర్ఆర్ పై కార్లు, ప్యాసింజర్ వాహనాలకు అనుమతి ఇవ్వడం లేదని రాచకొండ పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు. మీడియం, హెవీ గూడ్స్ వాహనాలకు యధావిధిగా అనుమతి ఉంటుందని తెలిపారు. అయితే ప్రయాణ టికెట్లు చూపిస్తే విమానాశ్రయానికి వెళ్లాల్సిన కార్లును అనుమతిస్తామని తెలిపారు. నాగోల్ ప్లె ఓవర్, కామినేని ప్లై ఓవర్, ఎల్బీ నగర్ ఎక్స్ రోడ్డులో మల్టీ లెవల్ ఫ్లైఓవర్, బైరామల్ గూడ ఎక్స్ రోడ్ (సాగర్ రింగ్ రోడ్డు), ఎల్బీనగర్ అండర్ పాస్, చింతల కుంట అండర్ పాస్ లోని మొదటి, రెండో లెవల్ ప్లె ఓవర్లపై లైట్ మోటార్, టూవీలర్, ప్యాసింజర్ వాహనాలను అనుమతి ఇవ్వబోమని తెలిపారు.

కొత్త సంవత్సరం సందర్భంగా రాష్ట్రంలోని మద్యం దుకాణాలపైనా అధికారులు చర్యలు తీసుకున్నారు. డిసెంబర్ 31న దాదాపు రూ.1000 కోట్ల లిక్కర్ సేల్ జరిగే ఛాన్స్ ఉందని మద్యం వ్యాపారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో డిసెంబర్ 31న మద్యం దుకాణాలను అర్థరాత్రి 12గంటల వరకు తెరిచి ఉంచుకోవచ్చని ఎక్సైజ్ శాఖ తెలిపింది. ఇక బార్లు, రెస్టారెంట్స్‌ను అర్థరాత్రి 1గంట వరకు తెరిచి ఉంచవచ్చునని ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ వ్యాప్తంగా జరిగే ఈవెంట్స్‌ను రాత్రి 1గంటలకు పరిమితం చేసింది. అదే సమయంలో డ్రగ్స్ విషయంలో కఠినంగా వ్యవహరించాలని డిసైడ్ అయింది.

Tags:    
Advertisement

Similar News