కత్తిపోటుకి అసలు కారణం వెల్లడించిన పోలీసులు

నిందితుడు రాజుని న్యాయస్థానం ముందు హాజరు పరిచామని, కోర్టు 14రోజులు రిమాండ్ విధించిందని తెలిపారు. ఈ ఘటనలో రాజు ఒక్కడే నిందితుడని పేర్కొన్నారు పోలీసులు.

Advertisement
Update:2023-11-01 21:32 IST

మెదక్ ఎంపీ ప్రభాకర్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం వెనక అసలు విషయం బయటపడింది. సిద్ధిపేట పోలీస్ కమిషనర్ శ్వేత మీడియా సమావేశంలో కత్తిపోటుకి కారణాలు వివరించారు. నిందితుడు రాజుని న్యాయస్థానం ముందు హాజరు పరిచామని, కోర్టు 14రోజులు రిమాండ్ విధించిందని తెలిపారు. ఈ ఘటనలో రాజు ఒక్కడే నిందితుడని పేర్కొన్నారు పోలీసులు.

కత్తిపోటు ఎందుకంటే..?

సంచలనం కోసమే నిందితుడు రాజు ఎంపీని కత్తితో పొడిచినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఫేమస్ అవ్వడం కోసమే రాజు, ఎంపీ ప్రభాకర్ రెడ్డిపై దాడి చేశాడని తెలిపారు పోలీసులు. ఈ ఘటనలో నిందితుడు రాజుకు ఎవరి సహకారం లేదని అన్నారు. రాజు వారం రోజుల క్రితమే కత్తి కొని ఎంపీ ప్రభాకర్ రెడ్డిపై దాడికి పథకం రచించాడని సీపీ వెల్లడించారు. నిందితుడు రాజు పలు సోషల్ మీడియా ఛానెళ్లలో పని చేస్తున్నాడని చెప్పారు. ఎన్నికల వేళ సోషల్ మీడియాలో ఎవరూ రెచ్చగొట్టే పోస్టులు పెట్టవద్దని ఈ సందర్భంగా సీపీ శ్వేత హెచ్చరించారు.

దాడి అనంతరం ఎంపీ ప్రభాకర్ రెడ్డి హైదరాబాద్ లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన మరో రెండురోజులపాటు ఐసీయూలోనే ఉండాల్సిన పరిస్థితి. అటు రాజుకి స్థానికులు దేహశుద్ధి చేయడంతో గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స అనంతరం పోలీసులు అతడిని కోర్టులో హాజరు పరిచారు. అనంతరం రిమాండ్ కి తరలించారు. 

Tags:    
Advertisement

Similar News