మాధవీలతపై క్రిమినల్ కేసు.. ఎందుకంటే..!

శ్రీరామనవమి రోజు నిర్వహించిన యాత్రలో పాల్గొన్నారు మాధవీలత. ఆ యాత్ర సిద్ధి అంబర్ బజార్‌ సర్కిల్‌కు చేరుకోగానే.. అక్కడున్న ఓ మత కట్టడాన్ని టార్గెట్ చేసి బాణం ఎక్కుపెట్టినట్లుగా పోజు ఇచ్చారు.

Advertisement
Update:2024-04-21 23:13 IST

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలతకు షాకిచ్చారు పోలీసులు. ఇటీవల ఓ వర్గం మనోభావాలను గాయపరిచేలా వ్యవహరించారంటూ ఆమెపై కేసు నమోదు చేశారు. మాధవీలతపై ఐపీసీ సెక్షన్ 295/A ( ఉద్దేశపూర్వకంగా ఓ వర్గం మనోభావాలను కించపరిచేలా వ్యవహారించడం) కింద బేగంబజార్‌ పీఎస్‌లో కేసు నమోదు చేశారు.

ఇంతకీ ఏం జరిగిందంటే..?

శ్రీరామనవమి రోజు నిర్వహించిన యాత్రలో పాల్గొన్నారు మాధవీలత. ఆ యాత్ర సిద్ధి అంబర్ బజార్‌ సర్కిల్‌కు చేరుకోగానే.. అక్కడున్న ఓ మత కట్టడాన్ని టార్గెట్ చేసి బాణం ఎక్కుపెట్టినట్లుగా పోజు ఇచ్చారు. ఇది కాస్త వివాదానికి దారి తీసింది. ఇక ఆ పోజుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అయింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. MIM చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ సైతం మాధవీలత చర్యలపై మండిపడ్డారు. మాధవీలత చర్యలు ఈసీకి, పోలీసులకు కనిపించడం లేదా అంటూ ఫైర్ అయ్యారు. 

Tags:    
Advertisement

Similar News