ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం.. తీర్పుపై రెండు వారాలా స్టే కోరిన గవర్నమెంట్

పిటిషన్‌ను విచారణకు తీసుకున్న హైకోర్టు.. మధ్యాహ్నం 2.30 గంటలకు లంచ్ మోషన్ విచారణ జరిపేందుకు అంగీకరించింది.

Advertisement
Update:2023-02-07 13:20 IST

బీఆర్ఎస్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను బీజేపీ మధ్యవర్తులు కొనుగోలు చేయడానికి ప్రయత్నించిన కేసును తెలంగాణ హైకోర్టు సోమవారం సీబీఐకి అప్పగించిన విషయం తెలిసిందే. కాదా ఈ ఉత్తర్వులను రెండు వారాల పాటు వాయిదా వేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును కోరింది. గతంలో ఈ కేసుపై ఇచ్చిన తీర్పులపై సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు వీలుగా తమకు రెండు వారాల సమయం ఇవ్వాలని కోరుతూ మంగళవారం సింగిల్ జడ్జ్ ధర్మాసనాన్ని రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ కోరారు.

రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ జరపాల్సిన అవసరం ఉందని జస్టిస్ బి. విజయ్‌సేన్ రెడ్డిని ప్రభుత్వం తరపున ఏజీ కోరారు. దీన్ని విచారణకు తీసుకున్న హైకోర్టు.. మధ్యాహ్నం 2.30 గంటలకు లంచ్ మోషన్ విచారణ జరిపేందుకు అంగీకరించింది. ఆ సమయంలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున దాఖలు చేసిన పిటిషన్‌పై మాత్రమే విచారణ జరుపుతామని తెలిపింది.

తెలంగాణకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి బీజేపీకి చెందిన ముగ్గురు మధ్యవర్తులు కొనుగోలు చేయడానికి గతేడాది ప్రయత్నించారు. మొయినాబాద్‌లోని పైలెట్ రోహిత్ రెడ్డికి చెందిన వ్యవసాయ క్షేత్రంలో బీజేపీ మీడియేటర్స్ రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజీ ఎమ్మెల్యేలు పార్టీ మారడానికి బేరసారాలు ఆడారు. ఆ సమయంలో సైబరాబాద్ పోలీసులు దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం దీనిపై సిట్ విచారణ వేసి.. లాయర్ భూసారపు శ్రీనివాస్, కేరళకు చెందిన తుషార్ వెల్లపల్లిలను కూడా నిందితులుగా చేర్చింది. అయితే దీనిపై నిందితులు అందరూ పిటిషన్ దాఖలు చేయగా.. కేసును సిట్ నుంచి బదిలీ చేసి సీబీఐకి హైకోర్టు అప్పగించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా సీజే ఉజ్జల్ భుయాన్, జస్టిస్ తుకారాంజీల ధర్మాసనం కొట్టేసింది.

తాజాగా దీనిపైనే రాష్ట్ర ప్రభుత్వం లంచ్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేసింది.

Tags:    
Advertisement

Similar News