సమాధానం చెప్పలేక కేసీఆర్ కుటుంబంపై విమర్శలు

మోదీ ప్రసంగంలో ఆ మూడు ప్రశ్నలకు సమాధానం ఉంటుందని ఆశించారు. కానీ ఆయన దగ్గర నో ఆన్సర్. సమాధానం లేకపోవడంతో విమర్శలకు పదును పెట్టారు. మరోసారి కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేశారు.

Advertisement
Update:2023-07-08 13:40 IST

వరంగల్ పర్యటనకు వచ్చిన ప్రధానికి బీఆర్ఎస్ మూడు ప్రశ్నలు సంధించింది.

1. కోచ్ ఫ్యాక్టరీ అని చెప్పి, వేగన్ రిపేర్ ఫ్యాక్టరీ ఎందుకు తెచ్చారు..?

2. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ సంగతి ఏంటి..?

3. గిరిజన యూనివర్శిటీకి స్థల సేకరణ జరిగినా పని ఎందుకు మొదలు పెట్టలేదు..?

మోదీ ప్రసంగంలో ఈ మూడు ప్రశ్నలకు సమాధానం ఉంటుందని ఆశించారు. కానీ ఆయన దగ్గర నో ఆన్సర్. సమాధానం లేకపోవడంతో విమర్శలకు పదును పెట్టారు. మరోసారి కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేశారు. కేసీఆర్ కుటుంబం అవినీతిలో కూరుకుపోయిందని ఎద్దేవా చేశారు మోదీ. తెలంగాణలో ప్రతి ప్రాజెక్ట్ లోనూ అవినీతి జరిగిందన్నారు.

భద్రాకాళి అమ్మవారి మహత్యానికి, సమక్క-సారలమ్మ పౌరుషానికి, రాణి రుద్రమ పరాక్రమానికి ప్రఖ్యాతి గాంచిన వరంగల్‌ కి రావడం సంతోషంగా ఉందని తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు ప్రధాని మోదీ. జన్‌ సంఘ్‌ కాలం నుంచి వరంగల్‌ బీజేపీకి కంచుకోట అని చెప్పారు. 2021 వరంగల్‌ మున్సిపాలిటీ ఎన్నికల్లో ట్రైలర్‌ చూపించామని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ని తుడిచిపెట్టేస్తామని ధీమా వ్యక్తం చేశారు మోదీ.

నన్ను తిట్టడమే పని..

ఉదయం లేచిన దగ్గర్నుంచి బీఆర్ఎస్ నేతలు తనను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు మోదీ. కాంగ్రెస్ అవినీతి పాలనను దేశమంతా చూసిందని, ఇప్పుడు తెలంగాణలో కూడా అలాంటి అవినీతి పాలన జరుగుతోందన్నారు. అదే సమయంలో తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని కూడా ప్రశంసించారు మోదీ. దేశాభివృద్ధిలో తెలంగాణ పాత్ర కీలకం అన్నారు. వ్యాక్సిన్ తయారీలో తెలంగాణ కీలకంగా మారిందని అన్నారు. ఇతర రంగాల్లో కూడా దేశ అభివృద్ధిలో తెలంగాణది ముఖ్య భూమిక అన్నారు మోదీ. 

Tags:    
Advertisement

Similar News