దేవుడయ్యా మోదీ..! ఈసారి ఇది కుదరదేమో..?

మోదీ హైదరాబాద్ వచ్చే వేళ బండి సంజయ్ కరీంనగర్ జైలులో ఉంటారు. టెన్త్ క్లాస్ పేపర్ లీకేజీ కేసులో ఆయనకు 14రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ఈరోజు బెయిల్ పిటిషన్ విచారణతో అసలు విషయం తెలుస్తుంది.

Advertisement
Update:2023-04-06 07:08 IST

దేవుడయ్యా మోదీ..! మోదీని పక్కనపెట్టుకుని, ఆయన ప్రాపకం కోసం బండి సంజయ్ చెప్పిన ఈ మాటలు అప్పట్లో వైరల్ గా మారాయి. ఏం చేశాడని మోదీ దేవుడయ్యారంటూ బీఆర్ఎస్ నుంచి ఓ రేంజ్ లో కౌంటర్లు పడ్డాయి. చివరకు బీజేపీలో కూడా ఇంత అతి అవసరమా అంటూ కొంతమంది గుసగుసలాడుకున్నారు. అయితే ఈసారి మోదీ తెలంగాణ పర్యటన సందర్భంగా ఈ హడావిడి ఉండదేమో అని బీజేపీ శ్రేణులే అనుకుంటున్నాయి. మోదీ హైదరాబాద్ వచ్చే వేళ బండి సంజయ్ కరీంనగర్ జైలులో ఉంటారు. టెన్త్ క్లాస్ పేపర్ లీకేజీ కేసులో ఆయనకు 14రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ఈరోజు బెయిల్ పిటిషన్ విచారణతో అసలు విషయం తెలుస్తుంది.

మోదీ పర్యటన షెడ్యూల్ ఇలా..

ప్రధాని మోదీ, హైదరాబాద్‌ పర్యటన షెడ్యూల్ ఖరారయింది. ఈనెల 8న శనివారం ఉదయం ఢిల్లీలో బయలుదేరే మోదీ.. ఉదయం 11.30 గంటలకు హైదరాబాద్‌ కు చేరుకుంటారు. మధ్యాహ్నం 1.30 గంటలకు తిరిగి హైదరాబాద్ నుంచి బయలుదేరుతారు.

11.30: బేగంపేట విమానాశ్రయానికి రాక

11.45: సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ కు చేరిక

11.45-12.00: సికింద్రాబాద్‌-తిరుపతి వందేభారత్‌ రైలు ప్రారంభం

12.15: పరేడ్‌ గ్రౌండ్‌ కు చేరిక

12.18-1.20: బహిరంగ సభ

1:30: బేగంపేట నుంచి తిరుగుప్రయాణం

కొన్నాళ్లుగా మోదీ పర్యటన వాయిదా పడుతున్నా, ఈసారి పక్కాగా ఫిక్స్ అయింది. వందే భారత్ రైలుని ప్రారంభించడంతోపాటు పలు ప్రాజెక్టుల్ని జాతికి అంకితం చేసేందుకు మోదీ హైదరాబాద్ వస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఏడాదిలో మోదీ పర్యటనలు ఇలా మొదలయ్యాయని చెప్పుకోవచ్చు. అసెంబ్లీ ఎన్నికలున్న రాష్ట్రాల్లో అర్జెంట్ గా చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు మోదీకి, అమిత్ షా కి గుర్తొస్తాయి. ఈ ఏడాది కూడా ఇవి ఇలా గుర్తొచ్చాయన్నమాట. ఎన్నికలయ్యేలోపు ఇలాంటి పర్యటనలు మరిన్ని జరిగే అవకాశముంది. 

Tags:    
Advertisement

Similar News