హైదరాబాద్ పర్యటనలో మోడీ లక్ష్మణ రేఖ దాటారు... సీపీఐ నారాయణ‌

“కేసీఆర్ మోడీకి మద్దతిచ్చినంత వరకు అవినీతి గురించికానీ, ఇతర విషయాల గురించి కానీ మాట్లాడలేదు. కేసీఆర్ ఇప్పుడు మోడీని ప్రశ్నించడం, సవాలు చేయడం ప్రారంభించడంతో, మోడీ బీఆర్ఎస్ ప్రభుత్వంపై దాడి చేయడం ప్రారంభించాడు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో సిఎం కుమార్తెను కూడా ఇరికించాడు. ఇది ఎన్నికల లబ్ధి కోసం చేస్తున్న రాజకీయ స్టంట్ తప్ప మరొకటి కాదు'' అని నారాయణ ఆరోపించారు.

Advertisement
Update:2023-04-08 21:37 IST

బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన విమర్శలను తీవ్రంగా ఖండిస్తూ, అధికారిక కార్యక్రమంలో ఎన్నికైన ప్రభుత్వంపై ప్రధాని దాడి చేయడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ మండిపడ్డారు.

“ప్రధానమంత్రి ‘లక్ష్మణ రేఖ’ను దాటి ఎన్నికైన ప్రభుత్వాన్ని అవమానించారు. చాలా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించాడు.”అని నారాయణ అన్నారు.

శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో నారాయణ మాట్లాడుతూ.. అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించే సమయంలో ప్రధాని అధికారిక వేదికను ఉపయోగించుకుని రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారని ఆరోపించారు.

“బీజేపీ ఒకవేళ బీఆర్‌ఎస్‌ను టార్గెట్ చేయాలనుకుంటే, పార్టీ మీటింగ్ నిర్వహించి, చేయండి. రాజకీయాల కోసం అధికారిక వేదికను ఉపయోగించుకోవడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు''అని ఆయన అన్నారు.

మోడీ గత తొమ్మిదేళ్లుగా అధికారంలో ఉన్నారని, బీఆర్‌ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని ఆయన భావిస్తే, ఇన్నాళ్లూ ఆయన ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు నారాయణ‌.

“కేసీఆర్ మోడీకి మద్దతిచ్చినంత వరకు అవినీతి గురించికానీ, ఇతర విషయాల గురించి కానీ మాట్లాడలేదు. కేసీఆర్ ఇప్పుడు మోడీని ప్రశ్నించడం, సవాలు చేయడం ప్రారంభించడంతో, మోడీ బీఆర్ఎస్ ప్రభుత్వంపై దాడి చేయడం ప్రారంభించాడు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో సిఎం కుమార్తెను కూడా ఇరికించాడు. ఇది ఎన్నికల లబ్ధి కోసం చేస్తున్న రాజకీయ స్టంట్ తప్ప మరొకటి కాదు'

' అని నారాయణ ఆరోపించారు.

రాజకీయ లబ్ధి కోసం బీజేపీయేతర రాష్ట్రాలను ప్రధాని లక్ష్యంగా చేసుకుని అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. తమిళనాడులో ప్రధాని ఓ అధికారిక కార్యక్రమంలో మతపరమైన భావాలు పెంచి ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారని ఆరోపించారు.

Tags:    
Advertisement

Similar News