ప్లీజ్... మా రాష్ట్రం రండి...బీఆరెస్ నేతలకు ఇతర రాష్ట్రాల నేతల ఆహ్వానాలు

తెలంగాణ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఆకర్షితులైన నాయకులు, ప్రజలు తమ రాష్ట్రాల్లో కూడా అలాంటి కార్యక్రమాలను పునరావృతం చేయాలని కోరారు. తెలంగాణలో గొర్రెల పంపిణీ కార్యక్రమం చాలా గొప్పగా ఉందని,కర్నాటకలో కూడా ఇదే కార్యక్రమాన్ని అమలు చేయాలని యాదవ, కుర్మ సంఘాల సభ్యులు వినోద్ కుమార్ తో అన్నారు.

Advertisement
Update:2022-12-30 08:07 IST

పార్టీలకు అతీతంగా వివిధ రాష్ట్రాల నాయకులు బీఆరెస్ నేతలను కలిసి తమ రాష్ట్రం రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. నిన్న కర్ణాటక, మహారాష్ట్ర లకు చెందిన పలువురు నాయకులు తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బి వినోద్ కుమార్‌ను కలిశారు. తమ తమ రాష్ట్రాల్లో భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్)కి ఘన స్వాగతం పలుకుతామని చెప్పారు.

తెలంగాణ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఆకర్షితులైన నాయకులు, ప్రజలు తమ రాష్ట్రాల్లో కూడా అలాంటి కార్యక్రమాలను పునరావృతం చేయాలని కోరారు.

తెలంగాణలో గొర్రెల పంపిణీ కార్యక్రమం చాలా గొప్పగా ఉందని,కర్నాటకలో కూడా ఇదే కార్యక్రమాన్ని అమలు చేయాలని యాదవ, కుర్మ సంఘాల సభ్యులు వినోద్ కుమార్ తో అన్నారు.

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ కార్యక్రమం చూసి ఎట్టకేలకు ఇటీవల రాష్ట్రంలో గొర్రెల పంపిణీని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ప్రారంభించారని యాదవ, కుర్మ సామాజికవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు సిద్ధన్న తేజీ తెలిపారు.

తెలంగాణ సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయాలని కర్ణాటక, మహారాష్ట్రల్లోని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

ఈ సమావేశంలో హుబ్లీ, ధార్వాడ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, బెంగళూరుకు చెందిన సహకార రంగ నాయకుడు నవీన్‌, బెంగళూరు మహిళా హక్కుల కార్యకర్త ఉషారాణి, చిక్కబల్లాపూర్‌ కార్మిక నాయకురాలు ప్రకాష్‌, మహారాష్ట్రలోని యవత్‌మాల్‌ గిరిజన సంఘాల నాయకుడు సింపుల్‌ రాథోడ్‌, అకోలా నుంచి అంబు నాయక్‌ పాల్గొన్నారు.

కర్ణాటక, మహారాష్ట్రల్లో రాజకీయ అస్థిరత నెలకొందని, ప్రతి సంవత్సరం జీవన ప్రమాణాలు దిగజారిపోతున్నాయని వారు తెలిపారు.

బీఆర్‌ఎస్ పార్టీ కార్యాచరణ ప్రణాళికను ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో ప్రకటిస్తారని తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్ వారికి తెలిపారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు త్వరలో మరో సమావేశం నిర్వహిస్తామని నేతలకు చెప్పారు.

Tags:    
Advertisement

Similar News