'హైడ్రా 'ఆర్డినెన్స్‌పై హైకోర్టులో పిటిషన్
సీఎస్, సహా ప్రతివాదులకు నోటీసులు జారీచేసిన ఉన్నత న్యాయస్థానం
'హైడ్రా 'ఆర్డినెన్స్‌పై తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలైంది. హైడ్రాకు విస్తృత అధికారాలు కట్టబెట్టడం చట్టవిరుద్ధమని మాజీ కార్పొరేటర్ మంచిరెడ్డి ప్రశాంత్‌రెడ్డి ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. హైడ్రా ఆర్డినెన్స్ సస్పెన్షన్‌కు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు..మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని సీఎస్, సహా ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మూడు వారాలు వాయిదా వేసింది.
హైడ్రాకు విస్తృత అధికారాలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇటీవల ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. దీంతో హైడ్రా చేపట్టబోయే అన్నిరకాల కార్యకలాపాలకు చట్టబద్ధత లభించింది. ఈ చట్టాన్ని రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదించనున్నట్లు సమాచారం. అప్పటిదాకా హైడ్రాకు ఈ ఆర్డినెన్స్ రక్షణగా ఉంటుంది.