బీఆర్‌ఎస్‌ హయాంలోనే ఇథనాల్‌ కంపెనీకి అనుమతులు

వివరాలు బైటపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం

Advertisement
Update:2024-11-29 13:21 IST

దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ కంపెనీకి సంబంధించిన వివరాలను ప్రభుత్వం బైటపెట్టింది. ఇథనాల్‌ కంపెనీకి బీఆర్‌ఎస్‌ హయాంలోనే అనుమతులు ఇచ్చారని స్పష్టం చేసింది. ఇథనాల్‌ కంపెనీకి అనుమతులు ఇచ్చి బీఆర్‌ఎస్‌ ప్రజలను మోసం చేసిందని ప్రభుత్వం మండిపడింది. పర్యావరణ శాఖ అనుమతులను ఉల్లంఘించి నిబంధనలు తుంగలో తొక్కారన్నది. కేంద్ర ప్రభుత్వం ఫ్యూయల్‌ ఇథనాల్‌కు మాత్రమే అనుమతి ఇచ్చిందని పేర్కొన్నది. కేంద్ర ప్రభుత్వ అనుమతులను గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నది. ఇథనాల్‌, ఎక్స్‌ట్రా న్యూటల్‌ ఆల్కహాల్‌ ఉత్పత్తులకు గత మంత్రివర్గం అనుమతులు ఇచ్చింది. ఇండస్ట్రియల్‌ స్పిరిట్స్‌, అబ్జల్యూట్‌ ఆల్కహాల్‌కు గత మంత్రి వర్గం అనుమతులు ఇచ్చింది. ఫ్యూయల్‌ ఇథనాల్‌ సాకుతో కంపెనీకి అనుకూలంగా అనుమతులు ఇచ్చారని పేర్కొన్నది. మినహాయింపు కోసం ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా కంపెనీ అడ్డదారులు అనుసరించిందని తెలిపింది.

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పర్యావరణ అనుమతి ప్రకారం స్థానిక సంస్థల ఎన్‌వోసీ తీసుకోవాలి. స్థానిక సంస్థల అనుమతులు లేకుండానే పీఎంకే డిస్టిలేషన్స్‌, కాంపౌండ్‌ వాల్‌ నిర్మించింది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ అండతోనే పీఎంకే డిస్టిలేషన్స్‌ నిబంధనలు ఉల్లంఘించిందని ప్రభుత్వం వెల్లడించింది. 2022 అక్టోబర్‌ 22న గత ప్రభుత్వం లెటర్‌ ఆఫ్‌ ఇండెంట్‌ జారీ చేసింది. 600 లక్షల లీటర్ల ఇథనాల్‌, ఇతర ఉత్పత్తుల కోసం గత ప్రభుత్వం ఎల్‌వోసీ జారీ చేసింది. గత ప్రభుత్వం మంత్రివర్గ ఆమోదం లేకుండానే అత్యవసరం పేరిట ఆదేశాలు జారీ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.

Tags:    
Advertisement

Similar News