ఎక్కువ మంది కలిసి మద్యం తాగితే పర్మిషన్ తీసుకోవాలి : మంత్రి పొన్నం
వందలాది మంది కలిసి మద్యం తాగేటట్లు అయితే ఎక్సైజ్ శాఖ అనుమతి తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఒకరిద్దరు విషయంలో ఎలాంటి నిబంధనలు ఉండవని పొన్నం తెలిపారు.
ఎక్కువ మంది కలిసి మద్యం తాగేటట్లు అయితే ఎక్సైజ్ శాఖ అనుమతి తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఒకరిద్దరు విషయంలో ఎలాంటి నిబంధనలు ఉండవని పొన్నం తెలిపారు. తెలంగాణలో ఎలాంటి మద్యాపాన నిషేధం లేదని దావతులు చేసుకోవచ్చుని స్పష్టం చేశారు. జన్వాడ ఫామ్ హౌస్‌లో ఎలాంటి పర్మిషన్లు చేసుకోనందుకు కేసు నమోదు చేసినట్లు మంత్రి తెలిపారు. తాము వెళ్లి రాజకీయంగా ఎవరిమీద కేసు పెట్టాలని చూడలేదని, సంఘటనలో మాజీ మంత్రి కేటీఆర్ బంధువులు ఉండటంతో మీడియా అట్రాక్ట్ అయ్యిందని అన్నారు.
దానిపై కాంగ్రెస్ నాయకులు స్పందించడం లేదని స్వయంగా హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారని, ఆయన విచిత్రంగా కేటీఆర్, తాము కుమ్మక్కు అయినట్లు మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. కేసులో పోలీసుల ఆత్మస్థైర్యం దెబ్బతినేలా మాట్లాడుతున్నారని, ఇలాంటి వ్యాఖ్యలు తగదని పొన్నం సూచించారు.