చంద్రబాబు తెలంగాణలో రాజకీయాలు చేస్తానంటే ప్రజలు అంగీకరించరు...ఎమ్మెల్సీ కవిత

ఇప్ప‌టికే తెలంగాణ‌ ప్ర‌జ‌లు టీడీపీని నిర్ద్వందంగా తిర‌స్క‌రించార‌ని కవిత అన్నారు. ఇక్క‌డ మూటా ముల్లె స‌ర్దుకుపోయిన త‌ర్వాత మ‌ళ్ళీ ఇక్క‌డ‌కొచ్చి రాజ‌కీయాలు చేస్తామంటే ప్ర‌జ‌లు అంగీక‌రించ‌ర‌న్నారు. ఆకాశంలో చుక్క‌లు ఎన్ని ఉన్నా చంద్రుడు ఒక్క‌డే అన్న చందంగా తెలంగాణ లో ముఖ్య‌మంత్రి కెసిఆర్ ఒక్క‌రేన‌ని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత పేర్కొన్నారు.

Advertisement
Update:2022-12-22 15:18 IST

క‌ల్వ‌కుంట్ల క‌విత

తెలంగాణ‌లో తెలుగుదేశం పార్టీని బ‌తికించుకోవాల‌ని ఇంకా ఆరాట‌ప‌డుతున్న ఆ పార్టీ అధినేత చంద్ర‌బాబు చేస్తున్న వ్యాఖ్య‌లు న‌వ్వుల పాల‌వుతున్నాయి. కాగా చంద్ర‌బాబు వ్యాఖ్య‌ల‌పై బిఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత స్పందించారు. తెలంగాణ‌ రాష్ట్రంలో తెలుగుదేశం రాజ‌కీయాలు చెల్ల‌బోవ‌ని అన్నారు. మ‌ళ్ళీ రాష్ట్రంలో టిడిపిని రుద్దాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ఎద్దేవా చేశారు. .

అయితే ఇప్ప‌టికే తెలంగాణ‌ ప్ర‌జ‌లు ఆపార్టీని నిర్ద్వందంగా తిర‌స్క‌రించార‌ని అన్నారు. ఇక్క‌డ మూటా ముల్లె స‌ర్దుకుపోయిన త‌ర్వాత మ‌ళ్ళీ ఇక్క‌డ‌కొచ్చి రాజ‌కీయాలు చేస్తామంటే ప్ర‌జ‌లు అంగీక‌రించ‌ర‌న్నారు. ఆకాశంలో చుక్క‌లు ఎన్ని ఉన్నా చంద్రుడు ఒక్క‌డే అన్న చందంగా తెలంగాణ లో ముఖ్య‌మంత్రి కెసిఆర్ ఒక్క‌రేన‌ని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత పేర్కొన్నారు.

కాగా, చంద్ర‌బాబు ఖ‌మ్మం లో బ‌హిరంగ స‌భ‌ నిర్వ‌హించి తెలంగాణలో టీడీపీ బలంగా ఉండాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించిన విష‌యం తెలిసిందే. రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేస్తామని కూడా అన్నారు. తెలంగాణలో ఓటు అడిగే హక్కు టీడీపీకి ఉందన్నారు. వివిధ పార్టీల్లోకి వెళ్లిన వారంతా మళ్లీ టీడీపీలోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు.

Tags:    
Advertisement

Similar News