కాంగ్రెస్‌ విజయోత్సవాలపై ప్రజలు ఆశ్చర్యపోతున్నారు : కిషన్ రెడ్డి

6 అబద్దాలు 66 మోసాలు పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యంపై బీజేపీ చార్జిషీట్‌ని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి విడుదల చేశారు.

Advertisement
Update:2024-12-01 17:05 IST

కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన వైఫల్యాలపై తెలంగాణ బీజేపీ ఛార్జ్‌షీట్ విడుదల చేసింది. కాంగ్రెస్ గ్యారంటీల గారడీ 6 అబద్ధాలు.. 66 మోసాలు' పేరుతో ఇవాళ హైదరాబాద్ లోని సోమాజిగూడాలో బీజేపీ నేతలతో కలిసి కేంద్ర మంత్రి, స్టేట్ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ఈ చార్జిషీట్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన కిషన్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని ఈ ఏడాది కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదని గెలిపించిన ప్రజలు అప్పుడే ఆలోచన పడ్డారన్నారు. రేవంత్ పాలనపై ఏ ఒక్క వర్గం సంతోషంగా లేరని విమర్శించారు. ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్చడంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.

పదేళ్ల పాటు నియంతృత్వపాలన కుటుంబపాలన అవినీతి పాలన సాగిస్తే అలవికాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. ప్రజలను నమ్మించడం కోసం దేవుడిపై ఒట్లు పెట్టారు. రుణమాఫీ ఇప్పటివరకు కొంతమంది రైతులకే జరిగింది. ఏడాది పూర్తయింది.. రైతు భరోసా ఎక్కడ?’’ అని కేంద్రమంత్రి ప్రశ్నించారు.‘‘కాంగ్రెస్‌ విజయోత్సవాలను చూసి రాష్ట్ర ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. హామీలు ఏమయ్యాయని ప్రజలు అడుగుతున్నారు. వందరోజుల్లో హామీలు పూర్తి చేస్తామన్నారు. ఏడాదైంది. ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని కిషన్‌రెడ్డి ఆరోపించారు.ఈ సమావేశంలో ఎంపీలు డికె అరుణ, రఘునందన్ రావు, నగేష్, బీజే ఎల్పీ నేత మహేశ్వర రెడ్డి, ఎమ్మెల్యే లు హరీష్ బాబు, పైడి రాకేశ్ రెడ్డి, వెంకట రమణారెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి పలువురు హాజరయ్యారు.

Tags:    
Advertisement

Similar News