బీఆర్ఎస్‌కు షాక్‌.. సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్‌లో చేరిక‌

వెంకటేశ్‌ నేత ఏ హామీతో కాంగ్రెస్‌లో చేరార‌నేదానిపై క్లారిటీ లేదు. ఇప్పటికే కాంగ్రెస్‌లో ఎంపీ టికెట్ల కోసం దరఖాస్తు ప్రక్రియ ముగిసింది.

Advertisement
Update:2024-02-06 11:30 IST

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ బొర్లకుంట వెంకటేష్‌ నేత పార్టీకి రాజీనామా చేశారు. కేసీ వేణుగోపాల్‌ను కలిసిన ఆయన సీఎం రేవంత్‌రెడ్డి స‌మ‌క్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

సిట్టింగ్ ఎంపీలకు టికెట్ ఇవ్వకూడదన్న బీఆర్ఎస్‌ అధినేత నిర్ణయంతోనే వెంకటేశ్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి బాల్క సుమన్ చేతిలో ఓడిపోయారు వెంకటేశ్‌. వెంటనే బీఆర్ఎస్ పార్టీలో చేరి.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు.


వెంకటేశ్‌ నేత ఏ హామీతో కాంగ్రెస్‌లో చేరార‌నేదానిపై క్లారిటీ లేదు. ఇప్పటికే కాంగ్రెస్‌లో ఎంపీ టికెట్ల కోసం దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. పెద్దపల్లి స్థానం కోసం 29 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కుమారుడు గడ్డం వంశీ కూడా ఉన్నారు. ఇక బీఆర్ఎస్ నుంచి పెద్దపల్లి రేసులో బాల్క సుమన్ పేరుతో పాటు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేరు వినిపిస్తోంది.

Tags:    
Advertisement

Similar News