అందుకే నేను ఇంటర్ ఫెయిలయ్యా -పవన్

పవన్ తన ఫెయిల్యూర్ స్టోరీ చెప్పారు, అయితే అందులో కూడా సక్సెస్ ఉందన్నారు. విద్యార్థిగా ఫెయిలైనా.. నిజాయితీలో మాత్రం పాసయ్యానని వివరించారు.

Advertisement
Update:2023-04-07 06:10 IST

Pawan Kalyan: అందుకే నేను ఇంటర్ ఫెయిలయ్యా - పవన్

వరంగల్ నిట్ లో జరిగిన స్ప్రింగ్ స్ప్రీ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన పవన్ కల్యాణ్ తన ఫెయిల్యూర్ స్టోరీతో ఒక్కసారిగా అందరికీ షాకిచ్చారు. సహజంగా ఇలాంటి ఫంక్షన్లలో సక్సెస్ స్టోరీలు చెప్పి విద్యార్థుల్లో ఉత్తేజం నింపుతారు అతిథులు. కానీ పవన్ తన ఫెయిల్యూర్ స్టోరీ చెప్పారు, అయితే అందులో కూడా సక్సెస్ ఉందన్నారు. విద్యార్థిగా ఫెయిలైనా.. నిజాయితీలో మాత్రం పాసయ్యానని వివరించారు.

వరంగల్ నిట్ విద్యార్థులను చూడగానే తన బాల్య స్మృతులు గుర్తొచ్చాయి పవన్ కల్యాణ్ కి. తాను ఇంటర్మీడియట్ పరీక్షలు ఫెయిలైన విషయాన్ని వారికి వివరించారు పవన్. తాను ఇంటర్ పరీక్షలు రాస్తున్న సమయంలో తోటి విద్యార్థులు, స్నేహితులు స్లిప్స్ తీసుకెళ్లి పరీక్షలు రాశారని, కానీ తాను మాత్రం చీటీలు పెట్టలేదని చెప్పారు. పరీక్షల్లో ఫెయిల్ అయినా సరే పర్లేదు, కాపీ కొట్టకూడదన్న భావనతో, నిజాయితీగా పరీక్షలు రాసి ఇంటర్ లో ఫెయిల్ అయ్యానన్నారు. పరీక్షల్లో పాస్ కాలేదు కానీ, నైతికంగా మాత్రం తాను విజయం సాధించానన్నారు. తానెప్పుడూ విద్యా సంస్థల కార్యక్రమాలకు పెద్దగా వెళ్లనని ఆ విషయంలో తనది సక్సెస్ స్టోరీ కాదన్నారు.


నేను నిత్య విద్యార్థిని..

తాను కాలేజీలు, యూనివర్సిటీలకు అంతగా వెళ్లలేదని, అయితే తాను నిత్య విద్యార్థినని, జీవితం నుంచి ఎంతో నేర్చుకుంటున్నానని అన్నారు పవన్ కల్యాణ్. మాజీ ప్రధాని నెహ్రూ ఎంతో ముందు చూపుతో ఎన్ఐటీలను ప్రారంభించారని గుర్తు చేశారు. వరంగల్ ఎన్ఐటీలో చదువుకుంటున్న వారు.. చదువుకు తగ్గ ఉద్యోగం సాధించాలని ఆకాంక్షించారు. జీవితంలో పరాజయాలు ఎదురవుతాయని, కానీ రేపు కచ్చితంగా విజయం అందుకుంటారని సూచించారు. కళ అనేది వివిధ ప్రాంతాల వారిని కూడా కలుపుతుందని, దానికి నాటు నాటు పాట నిదర్శనం అన్నారు. 

Tags:    
Advertisement

Similar News