తెలంగాణ 2BHK పథకంపై ప్రశంసలు కురిపించిన‌ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ

రాష్ట్రంలో 2BHK కార్యక్రమం అమలు తీరును కమిటీ సభ్యులు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇంత బృహత్తర గృహనిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టినందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించారు.

Advertisement
Update:2023-01-22 07:39 IST

రాజీవ్ రంజన్ సింగ్ అధ్యక్షతన రాజ్యసభ,లోక్‌సభ సభ్యులతో కూడిన హౌసింగ్, అర్బన్ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులు తెలంగాణలో పర్యటిస్తున్నారు. శనివారంనాడు హైదరాబాద్ శివారుల్లో సంగారెడ్డి జిల్లాలో ఉన్న కొల్లూరు గ్రామంలో పర్యటించిన కమిటీ అక్కడ నిర్మించిన ప్రభుత్వ డబల్ బెడ్ రూం ఇళ్ళను పరిశీలించారు.

రాష్ట్రంలో ఈ కార్యక్రమం అమలు తీరును కమిటీ సభ్యులు, అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇంత బృహత్తర  గృహనిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టినందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్‌ మేరకు రెండు పడకల‌ గదుల ఇళ్లను లబ్ధిదారులకు ఉచితంగా అందజేస్తున్నట్లు అధికారులు కమిటీ సభ్యులకు వివరించారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న డిగ్నిటీ హౌసింగ్‌ పథకం గురించి మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌ ఎన్‌ సత్యనారాయణ కమిటీకి వివరించారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) ద్వారా నిరాశ్రయులైన పేదల కోసం కొల్లూరులో 15,660 2BHK ఇళ్లను నిర్మించామని తెలిపారు.

ఒక్కో ఇంటి యూనిట్ ధర రూ.6.05 లక్షలు కాగా, ఇందులో మౌలిక సదుపాయాల వ్యయం రూ.75,000 అని అధికారులు తెలిపారు. కేంద్రం వాటా రూ.1.50 లక్షలు కాగా, రాష్ట్రం వాటా రూ.4.55 లక్షలు.

సంగారెడ్డి కలెక్టర్‌ శరత్‌, రంగారెడ్డి కలెక్టర్‌ అమోయ్‌కుమార్‌, జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ, పోలీసు శాఖల ఉన్నతాధికారులు ఈ పర్యటనలో పాల్గొన్నారు.

Tags:    
Advertisement

Similar News