మహిళలను కోటీశ్వరులను చేయడమే మా లక్ష్యం : సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడామే లక్ష్యంగా పనిచేస్తున్నాట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు.

Advertisement
Update:2024-12-05 21:39 IST

తెలంగాణ రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడామే లక్ష్యంగా పనిచేస్తున్నాట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్ లోని శిల్పారామంలో ఇందిరా మహిళాశక్తి బజార్‌ను సీఎం, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి ప్రారంభించారు. అంబనీ,అదానీతో ఆడబిడ్డలు పోటీపడాలనేదే తమ ఆకాంక్ష అని తెలిపారు. ఆడ బిడ్డల దగ్గర డబ్బులు ఉంటేనే కుటుంబాలు బాగుపడతాయని వివరించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతు డ్వాక్రా సంఘాల నేతృత్వంలో మహిళలకు 13 రకాల వ్యాపారాల్లో మెళకువలు నేర్పించి, వారిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతామని తెలియ జేశారు.

తాజాగా సోలార్ విద్యుత్ రంగంలో పలు కాంట్రాక్టులు కూడ మహిళా వ్యాపారవేత్తలకు ఇస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని అన్నారు. పాఠశాలల విద్యార్థులకు యూనిఫామ్స్ కుట్టే అవకాశం స్థానిక మహిళలకే ఇస్తున్నామని తెలియ జేశారు. డ్వాక్రా సంఘాల్లోని మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న శిల్పారామంలో వారు తయారు చేసిన ఉత్పత్తులు అమ్ముకునేందుకు అవకాశం కల్పిస్తున్నామని డిప్యూటీ సీఎం తెలిపారు.

Tags:    
Advertisement

Similar News