రేపటి నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఓరియంటేషన్ సెషన్
ఏర్పాట్లు పరిశీలించిన మండలి చైర్మన్, స్పీకర్
Advertisement
తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ, కౌన్సిల్‌కు కొత్తగా ఎన్నికైన సభ్యుల కోసం రెండు రోజుల పాటు ఓరియంటేషన్ సెషన్ నిర్వహిస్తున్నారు. నగరంలోని ఎంసీఆర్ హెచ్‌ఆర్డీలో బుధ, గురువారాల్లో నిర్వహించే ఈ ఓరియంటేషన్ ఏర్పాట్లను శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మంగళవారం పరిశీలించారు. వారి వెంట అసెంబ్లీ సెక్రటరీ డాక్టర్ వి. నర్సింహాచార్యులు, ఎంసీఆర్ హెచ్‌ఆర్డీ డైరెక్టర్ శశాంక్ గోయల్ ఇతర అధికారులు ఉన్నారు. రెండు రోజుల పాటు నిర్వహించే సెషన్‌లో భాగంగా చట్ట సభ పనితీరు, నిబంధనలు, చర్చలు, ఇతర అంశాలపై నిపుణులు అవగాహన కల్పించనున్నారు.
Advertisement