గుజరాత్‌కు ఒక నీతి, తెలంగాణకు ఒక నీతా?

పత్తికి కేంద్రం చెల్లించే మద్దతు ధర ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఎందుకు ఉన్నదని ప్రశ్నించిన మాజీ మంత్రి హరీశ్‌

Advertisement
Update:2024-10-17 12:03 IST

తెలంగాణ రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపెడుతున్నదని మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. పత్తికి కేంద్రం చెల్లించే మద్దతు ధర ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఎందుకు ఉన్నదని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.

'ఒకే దేశం-ఒకే పన్ను, ఒకే దేశం-ఒకే ఎన్నిక, ఒకే దేశం-ఒకే రేషన్‌' అంటూ ఊదరగొట్టే కేంద్ర ప్రభుత్వం.. ఒకే దేశం- ఒకే కనీస మద్దతు ధర ఎందుకు ఇవ్వడం లేదు. నాణ్యమైన పత్తిని పండిస్తున్న తెలంగాణ రైతు పట్ల ఎందుకీ వివక్ష? గుజరాత్‌ పత్తికి మద్దతు ధరగా క్వింటాల్‌కు రూ. 8,257 చెల్లిస్తున్న కేంద్రం.. తెలంగాణకు రూ. 7,521 మాత్రమే ఇవ్వడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తంచేశారు. గుజరాత్‌కు ఒక నీతి, తెలంగాణకు ఒక నీతా? అని హరీశ్‌ నిలదీశారు. 

Tags:    
Advertisement

Similar News