ఎస్సీ వర్గీకరణ అమలుకై ఏకవ్యక్తి న్యాయ కమిషన్.. ఉపసంఘం సిఫార్సు

తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమలుకై ఏకవ్యక్తి న్యాయకమిషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి మంత్రివర్గ ఉపసంఘం కీలక సిఫార్సు చేసింది.

Advertisement
Update:2024-10-08 20:17 IST

ఎస్సీ వర్గీకరణ అమలుకై ఏకావ్యక్తి కమిషన్ ఏర్పాటు చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం రాష్ట్ర సర్కార్‌కి సిఫార్సు చేసింది. ఇవాళ సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. కమిషన్ నియామకంలో అడ్వకేట్ జెనరల్ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని ఉప సంఘము తీర్మానించింది.అంతే కాకుండా ఏకవ్యక్తి కమిషన్ చట్టపరంగా పటిష్టంగా ఉండడంతో పాటు కమిషన్ సిఫారసులను అమలులోకి తీసుకొస్తే లీగల్ ఇష్యూస్ రాకుండా ఉండేలా నియామకం జరిగేలా చూడాలని ఉపసంఘం ఏకాభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ విషయంలో ఇప్పటికే అధికారుల బృందం తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాలలో పర్యటించి అధ్యయనం చేసిందన్నారు.

2011 జనాభా లెక్కల ప్రాతిపదికన ఉపకులాల వర్గీకరణ ఉంటుందని అందుకు సంబంధించిన పూర్తి సమాచారం ఉద్యోగ నియామకలతో సహా నివేదికను రూపొందించాలని ఆయన అధికారులను మంత్రి ఆదేశించారు. ఎస్సీ వర్గీకరణ పై ప్రజాభిప్రాయ సేకరణకు గాను మంత్రివర్గ ఉప సంఘం జిల్లాల వారీగా పర్యటించనున్నట్లు ఆయన వెల్లడించారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ అధ్యయనాన్ని టైమ్‌బౌండ్ ప్రోగ్రాం పెట్టుకుని పూర్తి చేయాలన్నారు. అదే విధంగా యుద్ధ ప్రాతిపదికన బీసీల సాంఘిక ఆర్థిక గణన చేపట్టాలని సూచించారు.అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయలన్నారు.ఆగస్టు1న సుప్రీంకోర్టు తీర్పు మేరకు తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమలుకై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన మంత్రులు పొన్నం ప్రభాకర్, దామోదర్ రాజనరసింహ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, లోకసభ సభ్యులు మల్లు రవి ఆధ్వర్యంలో మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో నాలుగో సారి మంత్రివర్గ ఉప సంఘం సమావేశం అయ్యింది.

Tags:    
Advertisement

Similar News