గ్రేటర్‌లో 77 వేల కొత్త ఓటర్లు

GHMC పరిధిలోని 15 నియోజకవర్గాల్లో మొత్తం 45 లక్షల 36 వేల 852 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 77,522 మంది కొత్త ఓటర్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

Advertisement
Update:2023-11-11 22:17 IST

గ్రేటర్ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ తుది ఓటర్ల జాబితా విడుదలైంది. GHMC పరిధిలోని 15 నియోజకవర్గాల్లో మొత్తం 45 లక్షల 36 వేల 852 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 77,522 మంది కొత్త ఓటర్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. పురుష ఓటర్లు 23,22,623 మంది, మహిళా ఓటర్లు 22,13,902, ట్రాన్స్‌జెండర్‌ ఓటర్లు 327, ఎన్‌ఆర్‌ఐ ఓటర్లు 883, సర్వీస్‌ ఓటర్లు 404, దివ్యాంగ ఓటర్లు 20,207, 80 ఏళ్లు పైబడిన ఓటర్లు 80,037 మందిగా ఉన్నారు.

గ్రేటర్ పరిధిలో ఉన్న 15 నియోజకర్గాలను పరిశీలిస్తే.. అంబర్‌పేట్, కార్వాన్, ఖైరతాబాద్‌, గోషామహల్, చాంద్రాయణగుట్ట, చార్మినార్, జూబ్లీహిల్స్, నాంపల్లి, బహదూర్‌పురా, మలక్‌పేట్, ముషీరాబాద్, యాకుత్‌పురా, సనత్‌నగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గాలు. ఈ 15 నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో అధికార BRS 7 స్థానాల్లో గెలవగా... MIM 7 స్థానాలు దక్కించుకుంది. గోషామహల్‌ నుంచి బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ ఎమ్మెల్యేగా గెలిచారు.

గ్రేటర్ పరిధిలో ఈ సారి కూడా BRS, MIMదే ఆధిపత్యం ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్‌లో జరిగిన అభివృద్ధిపై అధికార బీఆర్ఎస్ ధీమాగా ఉంది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి మెరుగైన ఫలితాలు సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తోంది.


Tags:    
Advertisement

Similar News