భువనగిరి బీఆర్‌ఎస్ పార్టీ ఆఫీస్‌పై ఎన్‌ఎస్‌యూఐ దాడి
భువనగిరి జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ ఆఫీస్‌పై కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ నాయకుల దాడి
యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ ఆఫీస్‌పై కాంగ్రెస్ ఎన్‌ఎస్‌యూఐ నాయకులు దాడికి పాల్పడ్డారు. పోలీసుల సమక్షంలోనే దాడులు జరుగుతున్నవాళ్లు చోద్యం చూస్తూ ఉండటం గమనార్హం. బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణా రెడ్డి శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్‌ఎస్‌యూ నాయకులు గుంపుగా వచ్చి పార్టీ కార్యాలయంపై దాడి చేశారు. ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలపై సైతం దాడికి యత్నించారు.
కాంగ్రెస్ కార్యకర్తల దాడిని బీఆర్‌ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. రేవంత్‌రెడ్డి పాలనపై విమర్శలను తట్టుకోలేకనే కాంగ్రెస్ నాయకులు దాడికి తెగబడ్డారని తెలిపింది. పాలన చేతగాక, మీ అసమర్థతపై ప్రశ్నిస్తే దాడులకు తెగబడతారా అని మండిపడింది. ఈ దాడిలో పూర్తిగా ధ్వంసమైంది ఆఫీస్ ఫర్నిచర్. పోలీసుల సమక్షంలోనే దాడులు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ నేతలు పేర్కొంటున్నారు. పోలీసుల ముందే దాడులు జరుగుతున్నా.. చోద్యం చూస్తున్నారా పోలీసులు అని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పిందని ప్రభుత్వం పై మండిపడుతున్నారు.