ఇక బెనిఫిట్ షోలకు టికెట్ రేట్లు పెంచుకోవడానికి నో పర్మిషన్

ఇకపై తెలంగాణలో ఎలాంటి బెనిఫిట్ షోలకు, టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వమని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు.

Advertisement
Update:2024-12-21 15:50 IST

ఇకపై తెలంగాణలో ఎలాంటి బెనిఫిట్ షోలకు, టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వమని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన రేవతి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.25 లక్షలు ప్రకటించింది. నేను సీఎంగా ఉన్నన్ని రోజులు ఎలాంటి బెనిఫిట్ షోలకు, టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తల్లి చనిపోయి పిల్లాడు బ్రెయిన్‌ డెడ్‌ అయితే సినిమా వాళ్లు ఎవరైనా పరామర్శకు వెళ్లారా. సినిమా వాళ్లు ఇన్సెంటివ్స్‌ కావాలంటే తీసుకోండి..

ప్రివిలేజ్‌ కావాలంటే కుదరదు. ఇక నుంచి టికెట్‌ ధరల పెంపు, బెనిఫిట్‌ షోలకు అనుమతి ఉండదు. నేను సీఎంగా ఉన్నంత వరకు అనుమతివ్వను. నేను ఈ కుర్చీలో ఉన్నంత వరకు మీ ఆటలు సాగనివ్వను. సినిమా వాళ్లంటే పోనీ.. రాజకీయ నాయకులు కూడా ఇష్టం వచ్చినట్లు నాపై విమర్శలు చేశారు’అని సీఎం రేవంత్‌ ఆవేదన వ్యక్తం చేశారు. 11 రోజుల తర్వాత హీరో దగ్గరికి పోలీసులు వెళితే దురుసుగా ప్రవర్తించారు. ఈవిషయంలో పదేళ్లు మంత్రిగా చేసిన వ్యక్తి నాపై అడ్డగోలుగా ట్వీట్‌ చేశాడు. చనిపోయిన వాళ్లను పట్టించుకోకుండా సీఎంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. బెనిఫిట్‌ షోకు అనుమతిచ్చింది ప్రభుత్వమే కదా’ అని సీఎం రేవంత్‌ అన్నారు. 

Tags:    
Advertisement

Similar News