వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు మెజార్టీరాదు,తెలంగాణలో వచ్చేది హంగ్ -కోమటి రెడ్డి
ఏ ఒక్క పార్టీకి 60 స్థానాలు వచ్చే అవకాశం లేదని సంచలన వ్యాఖ్యలు చేసిన కోమటి రెడ్డి ఒంటి చేత్తో కాంగ్రెస్ ను గెలిపించే నాయకుడు తెలంగాణలో లేడని స్పష్టం చేశారు. ఎవరైనా అలా అంటే తామంతా ఇంట్లో కూర్చుంటామని తేల్చి చెప్పారు.
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఏపార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేసేంత మెజర్టీ రాదని, ఏవైనా రెండు పార్టీలు కలిస్తే తప్ప ప్రభుత్వం ఏర్పాటు చేయలేవని కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెంకట రెడి జోస్యం చెప్పారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా అధికారంలోకి వచ్చే అవకాశమే లేదన్నారు.
ఏ ఒక్క పార్టీకి 60 స్థానాలు వచ్చే అవకాశం లేదని సంచలన వ్యాఖ్యలు చేసిన కోమటి రెడ్డి ఒంటి చేత్తో కాంగ్రెస్ ను గెలిపించే నాయకుడు తెలంగాణలో లేడని స్పష్టం చేశారు. ఎవరైనా అలా అంటే తామంతా ఇంట్లో కూర్చుంటామని తేల్చి చెప్పారు.
ఎవరో ఒకరు తామే పార్టీని అధికారంలోకి తెస్తామని భావిస్తే అంతకన్నా పొరపాటు లేదని పరోక్షంగా రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు కోమటి రెడ్డి. కాంగ్రెస్ లోని సీనియర్లంతా కలిసి కష్టపడితే 40 నుంచి 50 సీట్లు రావచ్చన్నారాయన.
''నాకున్న 35 ఏళ్ల రాజకీయ అనుభవంతో చెపుతున్నాను. వచ్చేది హంగ్ అసెంబ్లీనే'' అని కోమటి రెడ్డి కుండబద్దలు కొట్టారు. బీజేపీ, బీఆర్ఎస్ లాంటి ధనిక పార్టీలను ఎదుర్కోవాలంటే అందరం ఐక్యంగా పనిచేయాలని, ముందుగానే కనీసం 60 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాలని వెంకటరెడ్డి అన్నారు.
మార్చి 1వ తేదీ నుంచి అందరం కలిసి పార్టీ ప్రచారం మొదలుపెడతామని, తాను బైక్, బస్సు యాత్ర చేస్తానని వెల్లడించారు.అభ్యర్థులను ముందుగానే ప్రకటిస్తే ప్రజల మధ్యకు వెళ్లి ప్రచారాన్ని నిర్వహించడం తేలిక అవుతుందని కోమటి రెడ్డి అభిప్రాయపడ్డారు. .