తెలుగు రాష్ట్రాల్లోని 6 జిల్లాల్లో NIA దాడులు

రెండు తెలుగురాష్ట్రాల్లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) పలువురి ఇళ్ళల్లో సోదాలు నిర్వహిస్తోంది. పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ముసుగులో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే అనుమానంతో అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నారు.

Advertisement
Update:2022-09-18 10:01 IST

ఈ రోజు తెల్లవారుజాము నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎన్ ఐ ఏ సోదాలు నిర్వహిస్తోంది. తెలంగాణ లోని నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో, ఏపీలోని కడప, కర్నూలు, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో పలువురి ఇళ్ళల్లో ఎన్ ఐ ఏ దాడులు నిర్వహిస్తోంది. దాదాపు 60 బృందాలు ఈ సోదాలు నిర్వహిస్తున్నారని సమాచారం.

పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI) కేసులో ఈ సోదాలు జరుగుతున్నట్టు సమాచారం ఇప్పటికే నిజామాబాద్ జిల్లా PFI కన్వీనర్ షాదుల్లా సహా ఇమ్రాన్, అబ్దుల్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. వీరిపై పోలీసులు దేశ ద్రోహం కేసులు నమోదు చేశారు. PFI, కరాటే శిక్షణ, లీగల్‌ అవేర్‌నెస్‌ ముసుగులో కార్యకలాపాలు నిర్వహిస్తోందని ఎన్ ఐ ఏ అధికారుల ఆరోపణ‌ . భైంసా అల్లర్లతో సంబంధాలపైనా ఎన్‌ఐఏ ఆరా తీస్తోంది.

నిజామాబాద్, నిర్మల్‌ జిల్లాల్లో 23 బృందాలతో, కర్నూలు, కడప జిల్లాల్లో మరో 23 బృందాలతో, గుంటూరు జిల్లాలో 2 బృందాలతో, నెల్లూరులో రెండు బృందాలతో ఎన్‌ఐఏ తనిఖీలు నిర్వహిస్తోంది.

Tags:    
Advertisement

Similar News