కేసీఆర్, కేటీఆర్ రాజీనామా చేస్తే నేనూ చేస్తా
ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి వీధిరౌడిలా తనపై దాడి చేశారన్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్
హుజురాబాద్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి వీధిరౌడిలా తనపై దాడి చేశారని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ అన్నారు. ఆదివారం కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశంలో జరిగిన ఘటనపై ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌లో కౌశిక్‌రెడ్డిపై ఫిర్యాదు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కౌశిక్‌రెడ్డి స్వతహాగా చేశారా? ఎవరైనా రెచ్చగొడితే చేశారా? అనేది తేలాలన్నారు. ఘటనపై స్పీకర్‌కు ఫిర్యాదు చేశాను. నివేదిక తెప్పించుకుని చర్యలు తీసుకుంటారని భావిస్తున్నాను. పార్టీ ఫిరాయింపుల గురించి విలేకర్లు ప్రశ్నించగా.. దానికి సంజయ్ స్పందిస్తూ.. గతంలో ఇతర పార్టీల నేతలను బీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారు. ఇతర పార్టీల నుంచి చేరికలపై కేసీఆర్, కేటీఆర్ క్షమాపణలు చెప్పాలన్నారు. క్షమాపణలు చెప్పి కేసీఆర్, కేటీఆర్ రాజీనామా చేస్తే నేను కూడా రాజీనామా చేస్తానని సంజయ్ అన్నారు.