ఏడాది విజయోత్సవాల్లో ఎన్ కౌంటరా?
రేవంత్ సర్కార్ ఏడాది పాలనంతా బూటకపు వాగ్దానాలు, బూటకపు ఎన్‌కౌంటర్లు అని హరీశ్ ధ్వజం
Advertisement
అరెస్టులు, నిర్బంధాలు, కంచెలు, ఆంక్షలు ఒకవైపు.. బూటకపు ఎన్ కౌంట్లర్లు మరోవైపు రాష్ట్రంలో అశాంతిని రేపుతున్నాయని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఏడాది విజయోత్సవాలను నిర్వహిస్తుంటే ఈ పద్ధతి ఏమిటని ఆయన ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.రేవంత్ సర్కార్ అన్నివర్గాలను మోసం చేసి ఆరు గ్యారెంటీలను అటకెక్కించారని ధ్వజమెత్తారు. ఏడో గ్యారెంటీగా డబ్బా కొట్టిన ప్రజాస్వామ్య పాలనకు సైతం విజవంతంగా తూట్లు పొడిచారని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఏడాది పాలన బూటకపు వాగ్దానాలు, బూటకపు ఎన్‌కౌంటర్లతో గడిచిపోయిందని ఆగ్రహం వ్యక్తం శారు.
Advertisement