తెలంగాణ తల్లి విగ్రహ పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి
The Chief Minister inspected the works of Telangana Mother statue;
Advertisement
రాష్ట్ర సచివాలయం ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు పనులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును అధికారులను సీఎం అడిగి తెలుసుకున్నారు. డిసెంబర్ 9న సెక్రటేరియట్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించనున్నారు. రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు ఆగస్టు 28న సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ చేశారు. యూపీఏ తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం ప్రకటన చేసిన రోజు..సోనియాగాంధీ బర్త్‌డే.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రమాణ స్వీకారం చేసిన రోజైన డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఉత్సవాలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గతంలోనే నిర్ణయించిన విషయం తెలిసిందే.
Advertisement