కేటీఆర్ మీద కుట్ర చేస్తున్నావ్ అంటే.. ప్రశ్నించే గొంతు మీద కుట్ర : హరీశ్‌రావు
సీఎం రేవంత్‌రెడ్డి అన్యాయాలను ప్రశ్నిస్తూ.. మోసాలను ఎండగడుతున్న కేటీఆర్ మీద కుట్ర చేస్తున్నావ్ అంటే.. అది రాష్ట్ర ప్రజల మీద దాడి చేయడమే అని రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు
కాంగ్రెస్ ప్రభుత్వంపై అన్యాయాలను ప్రశ్నిస్తూ.. మోసాలను ఎండగడుతున్న మాజీ మంత్రి కేటీఆర్ మీద కుట్ర చేస్తున్నావ్ అంటే.. అది తెలంగాణ ప్రజల మీద దాడి చేయడమే అని సీఎం రేవంత్ పై మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. మెదక్ జిల్లా నర్సాపూర్‌లో మీడియాతో హరీశ్‌రావు మాట్లాడారు.కేటీఆర్‌ను అరెస్టు చేయిస్తా అని లీకులు రాయిస్తున్నారు.హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచిండు. రాష్ట్ర గౌరవం, ప్రతిష్టను పెంచిండు. ముంబై, ఢిల్లీ, బెంగళూరును కాదని హైదరాబాద్‌కు పెట్టుబడులు తెచ్చిండు. ఐటీలో తెలంగాణను నంబర్ వన్‌గా చేసిండు. నువ్వేమో డైవర్షన్ కోసం కేసులు పెడుతా..? అరెస్టులు చేయిస్తా..? అని లీకులు ఇస్తున్నవ్. నీ లీకులకు, తాటాకు చప్పుళ్లకు ఎవడు భయపడడు.
ఇవాళ కేటీఆర్ మీద కుట్ర చేస్తున్నావ్ అంటే అది ప్రశ్నించే గొంతు మీద కుట్ర. ముఖ్యమంత్రి చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాజీ సీఎం కేసీఆర్‌పై చేసిన కామెంట్స్ అప్రజా స్వామికం. రాష్ట్రంలో పాలనను గాలికి వదిలేసి సీఎం, మంత్రులు గాలిమోటార్లలో చక్కర్లు కొడుతున్నారు. మూసీ దురావస్థకు కారణం కాంగ్రెస్, టీడీపీల పాలననే. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. ప్రజాబలంతోనే కాంగ్రెస్ కుట్రలను ఎదుర్కొంటాం అని హరీశ్‌రావు తేల్చిచెప్పారు.